ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు


Fri,April 19, 2019 11:30 PM

సంగారెడ్డి చౌరస్తా: ఇంటర్మీడియట్ ఫలితాల్లో పట్టణ విద్యార్థులు మరోసారి తమ సత్తాను చాటారు. పట్టణంలోని సెయింట్ ఆంథోనీస్, శ్రీతేజ, అక్షయ, ఎస్‌వీ తదితర కళాశాలల విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. ఆయా కోర్సుల్లో మెరిట్ మార్కులు పొంది మెరుగైన ఫలితాలు సాధించారు. ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సీఈసీ తదితర కోర్సులలో ఉత్తమ ఫలితాలను సాధించి అందరి మన్ననలను పొందారు. ఆయా కళాశాలల వారిగా వెల్లడైన ఫలితాల వివరాలిలా ఉన్నాయి.

సెయింట్ ఆంథోనీస్‌లో...
స్థానిక సెయింట్ ఆంథోనీస్ జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి ఫలితాల ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ సీనియర్ విభాగంలో 1000 మార్కులకు గాను ఎంపీసీలో సాధన 988 మార్కులు సాధించగా, వైష్ణవి-983, సింధూజ-982, ఆర్ సమన్విత-981, ఎస్ తేజశ్రీ-980, ఎన్ అనిల్‌గౌడ్-980, విష్ణు-980 మార్కులు సాధించారు. సీనియర్ బైపీసీలో 1000 మార్కులకు గాను కావ్య-980, శ్రీవిద్య-978, మలిహా ఫాతిమా-976, సైదా సనా ఫాతిమా-973, ఐశ్వర్య-973, సబాహత్ జువేరియా-971 మార్కులు సాధించారు. సీనియర్ సీఈసీ, ఎంఈసీలో 1000 మార్కులకు గాను అసా తబస్సమ్ 916, మాలతి 900మార్కులు సాధించారు. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను నవ్యశ్రీ-465, హిఫా తరన్నామ్-465, శ్రీవిద్య-465, ఎండీ రియాన్-465, జోషీ సయాలి శ్రీపాద్-463 మార్కులు సాధించారు. జూనియర్ బైపీసీలో 440 మార్కులకు గాను సానియా-426, పార్థునాయక్-425, మనస్విని-422, సానియా మస్రత్-421, మానస-420, జస్రా ముస్కాన్-420 మార్కులు పొందారు. జూనియర్ సీఈసీ, ఎంఈసీలో 500 మార్కులకు గాను హరిప్రియ-465, పూజ-457 మార్కులు సాధించారు.

శ్రీతేజ జూనియర్ కళాశాలలో...
స్థానిక శ్రీతేజ జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి తమసత్తాను చాటారు. ఇంటర్ సీనియర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను మౌనిక 969 మార్కులు సాధించగా, మనీష-962, అమూల్య-956, సబాకనమ్-952, దివ్య-937, విశాల్-928, జగథ్‌రెడ్డి-921 మార్కులు సాధించారు. సీనియర్ బైపీసీలో 1000 మార్కులకు గాను హుమా నజమ్-978 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ఉత్తమ ర్యాంకు సాధించగా, నమత-964, కావేరి-950, మునస్సార్-939, తబస్సమ్-964, నవనీత-932 మార్కులు సాధించారు. సీనియర్ సీఈసీలో 1000 మార్కులకు గాను మధురిమ-952,ఆర్షియా ఫాతిమా-948, ఎన్ మౌనిక-933, మోక్షిత-926, ఎం మౌనిక-924 మార్కులు సాధించారు. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను రఫియా బేగం-450, రుచిత-434, జూనియర్ సీఈసీలో 500 మార్కులకు గాను విజయ్-458, అమీనా ఫాతిమా-435 మార్కులు సాధించారు.

అక్షయ జూనియర్ కళాశాలలో...
సంగారెడ్డి చౌరస్తాలోని అక్షయ జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ సారి అదే ఫలితాలను సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకులను సొంతం చేసుకున్నారు. ఇంటర్ సీనియర్ ఎంపీసీ విభాగంలో సృతి 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకును సాధించింది. అదేవిధంగా సీనియర్ బైపీసీలో వైష్ణవి, భవానీలు 1000 మార్కులకు గాను 978 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలను సాధించారు. సీనియర్ ఎంఈసీలో కీర్తిప్రియ 1000 మార్కులకు గాను 971 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయి ర్యాంకును కైవసం చేసుకున్నది. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో 470మార్కులకు గాను పూజిత, దేనేశ్ బహదూర్, భానుప్రసాద్‌లు 462 చొప్పున మార్కులు సాధించారు. జూనియర్ బైపీసీలో 440 మార్కులకు గాను సుప్రియ-431 మార్కులు సాధించగా, జూనియర్ సీఈసీలో 500 మార్కులకు గాను లియా అన్నథమస్-492 మార్కుతో మెరుగైన ఫలితాలను సాధించారు.

ఎస్‌వీ జూనియర్ కళాశాలలో...
పట్టణంలోని స్థానిక ఎస్‌వీ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఇంటర్ సీనియర్ ఎంపీసీ విభాగంలో వర్షిణి 1000 మార్కులకు గాను 984 మార్కులు సాధించగా, సీనియర్ బైపీసీలో జోసెపైన్ జోస్ 978, గుల్షన్ ఎరా 977 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలను సాధించారు. సీనియర్ సీఈసీలో 1000 మార్కులకు గాను ఫరా తజ్బీన్-967 మార్కులు సాధించగా, సీనియర్ ఎంఈసీలో మౌనిక-935 మార్కు సాధించారు. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో 470మార్కులకు గాను భాగ్యశ్రీ, కృష్ణలు 463 చొప్పున మార్కులు సాధించారు. జూనియర్ సీఈసీలో 500 మార్కులకు గాను నందిని-486, జూనియర్ ఎంఈసీలో సుప్రజ-475 మార్కులు సాధించి మెరుగైన ఫలితాలను సాధించారు.

రాయల్ జూనియర్ కళాశాల జయకేతనం...
సంగారెడ్డి టౌన్: ఇంటర్ ఫలితాలలో రాయల్ జూనియర్ కళాశాల జయకేతనం ఎగురవేసింది. అత్యధిక ఉత్తీర్ణత శాతంతో పాటు అత్యుత్తమ ఫలితాలు సాధించింది. గురువారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో కళాశాలకు చెందిన విద్యార్థులు విజయదుందుభి మోగించారు. సీనియర్ ఎంపీసీలో 1000 మార్కులకు గాను ఎండి. అబ్దుల్ ఇర్ఫాన్ 982 మార్కులు, బైపీసీలో ఎండీ. హైమద్ 1000కి గాను 940, ఎంఈసీలో అనీఫ్ 932, సీఈసీలో షేక్ సల్మాన్ 898 మార్కులు సాధించారు. జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను నిఖిల్ 464 మార్కులు, బైపీసీలో 440 గాను హిమాద్రి నందిని 425, సీఈసీలో 500లకు గాను యూసుఫ్ 459మార్కులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కృపానిధి ఫరీడా విజయం సాధించిన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని అభినందించారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...