జోగిపేటలో లంకా దహనం


Fri,April 19, 2019 11:29 PM

అందోల్, నమస్తే తెలంగాణ: జోగినాథస్వామి రథోత్సవ జాతర ఉత్సవాల్లో భాగంగా జోగిపేటలో లంకాదహనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రావణుడి ప్రతిమను తయారుచేసి కాల్చివేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. గురువారం జోగిపేటలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ స్టేడియంలో 30 ఫీట్ల ఎత్తులో రావణాసురుడి ప్రతిమను తయారు చేసి పటాకులను అమర్చారు. రాజరాజేశ్వరీ దేవాలయం నుంచి పల్లకీ సేవను జోగినాథుడి ఆలయం వరకు నిర్వహించి, అక్కడ పూజలు చేసి గురువారం అర్థరాత్రి 12గంటల తర్వాత రావణాసురుడి విగ్రహం వద్ద పూజలను చేశారు. ఆలయ పూజారులు వీరభద్రప్ప, సిద్ధేశ్వర్, సుజీత్ కుమార్, సోమేశ్వర్‌లు రావణుడి ప్రతిమ వద్ద దండకాలు వేశారు. అనంతరం లంకాదహనాన్ని ప్రారంభించారు. బటన్ సిస్టమ్‌తో రూపొందించిన పటాకులను స్వీచ్ ఆన్‌చేస్తూ ఒక్కొక్కటిగా పేల్చారు. ఈ కార్యక్రమంలో అందోలు-జోగిపేట మున్సిపల్ చైర్‌పర్సన్ ఎస్. కవిత సురేందర్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ అల్లె శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ. నాగభూషణం, కౌన్సిలర్లు పిట్ల లక్ష్మణ్, తొట్ల మమత రామకృష్ణ, జోగ్యాల లక్ష్మి-లక్ష్మీనారాయణ, గాజుల నవీన్, పులుగు గోపాల్‌రావు, తుపాకుల సునిల్, మార్కెట్ డైరెక్టర్ మల్లికార్జున్, మాజీ ఎంపీపీ హెచ్. రామాగౌడ్, మాజీ ఎంపీటీసీలు ఎస్. సురేందర్‌గౌడ్, ఎ.చిట్టిబాబు, డీజీ. వెంకటేశం, ఆకుల శంకర్, సీడీసీ మాజీ డైరెక్టర్ జగన్మోహన్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు భిక్షపతి, డాకూరి శంకరయ్య, రంగంపేట నారాయణ, మహేశ్ యాదవ్, డాకూర్ శంకర్, ఆకుల నాగయ్య, ఉల్వల సురేశ్, మాణయ్య, గుర్రం సత్తయ్యలు పాల్గొన్నారు.

పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు...
జోగినాథ స్వామి ఉత్సవాల్లో భాగంగా తుది ఘట్టమైన లంకా దహనం కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన పటాకులతో జోగిపేట పట్టణం దద్దరిల్లింది. గురువారం రాత్రి 10 గంటల నుంచి పటాకుల మోత ప్రారంభించారు.

పటాకుల చప్పుళ్లతో పట్టణ, పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో లంకా దహనాన్ని తిలకించేందుకు మైదానానికి చేరుకున్నారు.

ఆకట్టుకున్న పటాకులు...
జోగిపేటలో రాత్రి నిర్వహించిన లంకా దహనం కార్యక్రమంలో ప్రత్యేకంగా త యారు చేయించిన పటాకులు ఆకర్శణీయంగా నిలిచాయి. మల్లె పందిరి ఆకారం, ఈతచెట్లు, బుసలు కొట్టే సర్పములు, ఫ్లవర్ షాట్ బాంబులు, సింగిల్ బాంబులు, చిట్‌పట్ బాంబులు, ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. వీటిని కాలుస్తున్నంత సేపు ప్రజలు సెల్‌ఫోన్‌లలో వీడియో, ఫొటోలను తీయడం కనిపించింది.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...