ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు శాఖ సిద్ధం


Fri,April 19, 2019 11:29 PM

జహీరాబాద్, నమస్తే తెలంగాణ: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని జహీరాబాద్ డీఎస్పీ గణపతి జాదవ్ తెలిపారు. శుక్రవారం జహీరాబాద్ డీఎస్పీ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై విలేకరులకు వివరించారు. జహీరాబాద్ సబ్‌డివిజన్‌లోని జహీరాబాద్ పట్టణ, జహీరాబాద్ రూరల్, చెరాగ్‌పల్లి, కోహీర్, హద్నూర్, ఝరాసంగం, రాయికోడ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న పోలింగ్‌స్టేషన్ వివరాలు, ఎంత మంది పోలీసు సిబ్బంది అవసరం ఉన్నారో గుర్తించడం జరిగిందన్నారు. పోలీసు శాఖ ఇప్పటికే శాసన సభ, లోక్‌సభ, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు. మూడు ఎన్నికల్లో ఎక్కడా ఎలాంటి సంఘటన లేకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడంతో పాటు ఈవీఎఎంలు స్ట్రాంగ్‌రూంకు చేరే వరకు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిందన్నారు. జహీరాబాద్ పట్టణ, రూరల్ సీఐలు సైదేశ్వర్, పాలవెల్లిలు ప్రాదేశిక ఎన్నికల పై పర్యవేక్షణ చేస్తున్నారని వివరించారు. జహీరాబాద్ 13, మొగుడంపల్లి 11, న్యాల్‌కల్ 15, ఝరాసంగం 13, కోహీర్ 16, రాయికోడ్ 12 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. వీటితో పాటు ఆరు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఉన్నాయన్నారు. పోలీసుస్టేషన్ వారీగా ఎస్‌ఐలు గ్రామాల్లో నిఘా పెంచడంతో పాటు ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని గుర్తించి గత మూడుఎన్నికల్లో బైండోవర్ చేశామన్నారు.

జహీరాబాద్ డివిజన్ కర్ణాటక సరిహద్దులో ఉండడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జాతీయ రహదారి, బీదర్, చించోళి, తాండూర్ రోడ్లు పై ప్రతి రోజు వాహనాలు తనిఖీలు చేయడంతో పెట్రోలింగ్ పెంచామన్నారు. గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతిరోజు ఎన్నికల నిర్వహణ కోసం పోలీసులకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

ప్రశాంతంగా లోక్‌సభ ఎన్నికలు...
లోక్‌సభ ఎన్నికలు ప్రజల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని డీఎస్పీ గణపతి జాదవ్ తెలిపారు. డివిజన్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు సంపూర్ణంగా సహకరించారన్నారు. జహీరాబాద్ పట్టణ, రూరల్ సీఐలు సైదేశ్వర్, పాలవెల్లిలు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేశారన్నారు. ప్రజలు లోక్‌సభ ఎన్నికలకు సహకరించిన విధంగా ప్రాదేశిక ఎన్నికలకు సహకరించాలని కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గ్రామాల్లో సభ ఎన్నికలు ఏర్పాటు చేసి చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతిరోజు పోలీసు అధికారులు, పోలీసులు గ్రామాలకు వెళ్లి ఎన్నికల నిర్వహణ పై ప్రజలను చైతన్యం చేస్తున్నారని వివరించారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...