ఘనంగా హనుమాన్ శోభాయాత్ర


Fri,April 19, 2019 11:29 PM

అందోల్, నమస్తే తెలంగాణ : హనుమాన్ శోభాయాత్ర అందోలు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని అందోలు, పుల్కల్, రాయికోడ్, మునిపల్లి, వట్‌పల్లి, నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని హత్నూర మండలాల పరిధిలోని గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. రాయికోడ్‌లో చేపట్టిన హనుమాన్ శోభాయాత్రలో ఎమ్మెల్యే చంటిక్రాంతికిరణ్ పాల్గొన్నారు. జోగిపేట పట్టణంలో వీర హనుమాన్ దేవాలయంలో 108సార్లు హనుమాన్ చాలీసా పఠనం చేశారు. హనుమాన్ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆయా మండలాలకు చెందిన పోలీసులు గట్టి బందోబస్తును చేపట్టారు. నియోజకవర్గంలోని మండలాల్లో జై శ్రీరామ్...జైజై శ్రీరామ్...జై హనుమాన్ అంటూ నినాదాలతో గ్రామాలన్ని మార్మోగాయి.

అందోలు మండలంలో..
జోగిపేట పట్టణంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు చేపట్టారు. ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో వీర హనుమాన్ దేవాలయం నుంచి పట్టణ పుర వీధుల మీదుగా శోభాయాత్రను ఊరేగించారు. ఈ శోభాయాత్రను జోగిపేట సీఐ తిరుపతిరాజు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. డీజే సౌండ్ పెట్టుకుని యువకుల నృత్యాలతో కాషాయపు జెండాలను ఊపుకుంటూ శోభాయాత్ర కొనసాగించారు. పట్టణమంతా జై శ్రీరామ్...జై హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. జిన్నారం నుంచి ప్రత్యేకంగా రప్పించిన డప్పు కళాకారుల ఆట-పాట ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ. నాగభూషణం, పట్టణ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు చాపల వెంకటేశం, మున్సిపల్ కౌన్సిలర్ గాజుల నవీన్, మాజీ వార్డు సభ్యుడు పి. ప్రవీణ్‌కుమార్, భజరంగ్‌దళ్ ఆలయ కమిటీ సభ్యులు ఎం. మల్లికార్జున్, పురం లక్ష్మణ్, మాణయ్య, పులుగం శ్రీనివాస్, పురం రాఘవేందర్, మహేశ్ యాదవ్, ప్రవీణ్‌గౌడ్, గాజుల అనిల్, సుమన్, సత్యంలతో పాటు తదితరులు పాల్గొన్నారు. శోభాయాత్రలో మయూరి డ్రెస్సెస్, కొమల్ డ్రెస్సెస్‌ల వ్యాపార సంస్థల ఆధ్వర్యంలో పులిహోరను పంపిణీ చేశారు.

రాయికోడ్‌లో..
రాయికోడ్‌లో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ యాత్రలో అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పాల్గొని, హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ పి.జైపాల్‌రెడ్డి, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ యేసయ్య, ఎంపీపీ అధ్యక్షుడు వెంకట్రావ్‌పటేల్, మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు విఠల్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు తుకారం, సతీష్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

వట్‌పల్లిలో..
వట్‌పల్లితో పాటు మండల పరిధిలోని ఘట్‌పల్లి, నాగులపల్లి, దేవునూర్‌లతో పాటు ఇతరత్రా గ్రామాల్లో హనుమాన్ శోభాయాత్రను పెద్ద ఎత్తున చేపట్టారు. ఆయా గ్రామాల్లో జైశ్రీరామ్ నామ స్మరణతో మార్మోగాయి. కార్యక్రమంలో సర్పంచ్‌లు నారాయణగౌడ్, రమేశ్, సురేఖ బుద్దిరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ అశోక్‌గౌడ్, ఎంపీటీసీ సంజీవరావు, బీజేపీ నాయకుడు చంద్రశేఖర్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

హత్నూరలో..
హత్నూర : హనుమాన్ జయంతి ఉత్సవాలు హత్నూర మండలంలో శుక్రవారం ఘనంగా కొనసాగాయి. గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా హత్నూరలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర పెద్ద ఎత్తున నిర్వహించారు. హనుమంతుడి విగ్రహాన్ని గ్రామాల్లోని ప్రధాన వీధులగుండా ఊరేగించి యువకులు, చిన్నారులు నృత్యాలు చేశారు. అనంతరం హనుమాన్ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...