రేపే నోటిఫికేషన్


Thu,April 18, 2019 11:42 PM

(సంగారెడ్డి, నమస్తేతెలంగాణ ప్రధానప్రతినిధి) : పరిషత్ ఎన్ని కలకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్ పర్యవేక్షణలో ఓ వైపు ఏర్పాట్లు కొనసాగుతుండగా మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్‌తో పాటు ఎస్పీ లు సమీక్షకు హాజరయ్యారు. అన్ని ఏర్పాట్లతో ఎన్నికలకు సిద్ధం గా ఉన్నామని కలెక్టర్ హనుమంతరావు చెబుతున్నారు. ఇప్పటికే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ అనుభవంతో ఈ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా జిల్లాలో మొత్తం 25 ఎంపీపీ, 25జడ్పీటీసీ, 295ఎంపీటీసీ స్థానాలుండగా మూడు విడుతల్లో ఎన్నికల నిర్వహణ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20ఎన్ని కల నిర్వహణకు నోటీ ఫికేషన్ విడుదల కానున్నది. నోటిఫికేషన్ విడుదల కానున్న నేప థ్యంలో ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీల్లో మళ్లీ సందడి మొదలైంది.

మూడు విడుతల్లో పోలింగ్...
జిల్లాలో మూడు విడుతల్లో పోలింగ్ జరుగనున్నది. జిల్లాలో 25మండలాలు (మండల స్వరూపం కోల్పోయిన రామచంద్రాపురం మినహా) 25జడ్పీటీసీలు, 295ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి పరిధిలో మూడు విడుతల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడుతలో 9, రెండో విడుతలో 9, మూడో విడుతలో 7 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడుతలో సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్‌చెరు, అమీన్‌పూర్, జిన్నా రం, గుమ్మడిదల, హత్నూరలల్లో జరిగే ఎన్నికల కోసం 581 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రెండో విడుతలో నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్, మనూర్, నాగిల్‌గిద్ద, పుల్‌కల్, అందోల్, వట్‌పల్లి మం డలాల్లో 564పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేశారు. మూడో విడుతలో జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్‌కల్, ఝరాసంఘం, కోహీర్, రాయికోడ్, మునిపల్లి ఏడు మండలల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. మూ డు విడుతల్లో ఎన్నికల నిర్వహణకు మొత్తం1648పోలింగ్ కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నారు. మొదటి విడుతలో 581, రెండో విడుతలో 564, మూడో విడుతలో 503 కేంద్రా లు ఏర్పాట్లు చేయనున్నారు.

అధికార పార్టీలో జోష్..
నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే జిల్లాలకు పరిషత్ ఎన్నికలను ఇన్‌చార్జిల ను కూడా నియమించిన విషయం తెలిసిందే. జిల్లాకు ఎమ్మెల్సీ శేరీ సుభాష్‌రెడ్డి ఇన్‌చార్జిగా వ్యవ హరిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఖాయమైనప్పటికీ మెజార్టీపైనే ఉత్సాహంతో పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. కాగా శాసన సభ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల్లో అవే ఫలితాలు చూడనున్నాయి. క్యాడర్ లేమి తో కొట్టుమిట్టాడుతున్నా ఆ పార్టీలు పరిషత్ పోరులో నిలవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో అధికార టీఆర్‌ఎస్‌లో జోష్ కనిపిస్తుండగా ప్రతిపక్షల్లో ఎన్నికల వాతావరణ కనిపించడంలేదు. వరుస ఎన్నికల్లో పరాభావం మూటగట్టు కుంటున్న కాంగ్రెస్, బీజేపీలు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో చాలా చోట్ల అభ్యర్థులు బరిలో నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. అభ్యర్థులను నిలబెట్టి పరు వు తీసుకోవడం తప్ప మరోకటి లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు నమస్తేతెలంగాణ ప్రతినిధితో చెప్పుకురావడం గమనార్హం.

అన్ని ఏర్పాట్లు చేశాం...
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ల శిక్షణ రేపటితో ముగుస్తుంది. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఇప్పటికే పూర్తయ్యిం ది. ఎన్నికల సామాగ్రి సిద్ధం చేస్తున్నాం. జిల్లాలో మొత్తం 1648 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాం. జిల్లాలో 25జడ్పీటీసీ, 295ఎంపీటీసీ స్థానాలకు మూడు విడుతల్లో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి గురువారం ఏర్పాట్లపై సమీక్షించారు. తనతో పాటు జిల్లా ఎస్పీ కూడా సమీక్షకు హాజరయ్యారు. ఎన్నికల నిర్వాహణకు అన్ని రకాల ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని కమిషనర్‌కు చెప్పాం. ఇప్పటికే శాసన సభ, పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాం. ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటనకు తావు లేకుండా రెండు ఎన్నికలు జరిగాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను అదే స్ఫూర్తితో ప్రశాంతంగా నిర్వహించడానికి తగు విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం.
- హనుమంతరావు, కలెక్టర్

ఎన్నికలకు సిద్ధంగా ఉండండి..
జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఉన్నతాధికారు సమావేశం
సంగారెడ్డి చౌరస్తా : త్వరలో జరుగనున్న జడ్ఫీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని హోటల్ మారియట్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపి మహేందర్‌రెడ్డిలతో కలిసి నాగిరెడ్డి నిర్వహించిన సమావేశానికి జిల్లా నుంచి కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రవికుమార్‌లు హాజరయ్యారు. జిల్లాలో జరుగబో యే జడ్ఫీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సమీక్షించారు. ఎన్నికలలో పాటించాల్సిన నియమాలను వివరించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కా ప్రణాళికతో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా అధికారులకు సూచించారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...