టార్గెట్ జూన్ 30


Thu,April 18, 2019 11:40 PM

చిన్నకోడూరు : వేల కోట్ల రూపాయలు వ్యయంతో వ్యవసాయ రంగానికి సాగునీరు అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ భారీ ఎత్తున సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ఈ పనులన్ని చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఈ ప్రాజెక్టు పనులో ప్రజాప్రతినిధులందరు భాగస్వామ్యం కావడం ఎంతో అదృష్టమన్నారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం ఇంతకన్న గొప్ప పని మరోకటి ఉండదన్నారు. ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన త్వరితగతిన పూర్తయ్యే విధంగా ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావడం గర్వకారణమని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం రాత్రి చిన్నకోడూరు మండలం చంద్లాపూర్, పెద్దకోడూ రు గ్రామ శివారులో నిర్మిస్తున్న రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోని పల్లగుట్టపై ఉన్న ఎస్‌ఈ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 10,11వ ప్యాకేజీ పనులపై ఈఎన్‌సీ హరిరామ్‌తో కలిసి ఎమ్మెల్యే హరీశ్‌రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో జూన్ 30లోపు సర్జిపుల్ పంపుహౌస్ పనులు పూర్తి కావాలన్నారు. అనంతగిరి రిజర్వాయర్ నుంచి రంగనాయకసాగర్‌ను కలిపే 300మీటర్ల అప్రోచ్ కెనాల్ 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్యాకేజీ -10అనంతగిరి రిజర్వాయర్ పెండింగ్ పనుల పై అధికారులను ఆరా తీశారు. టన్నెల్‌లో మిగిలిపోయి న 110మీటర్ల లైనింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. సర్జిపుల్ పనులను వేగవంతం చేసి మే చివరి నాటికి పూర్తి కావాలన్నారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే పనులు పూర్తయ్యే విధం గా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతగిరి రిజర్వాయర్ పనులు జూన్ నాటికి పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. కాలువల నిర్మా ణం వేగంగా పూర్తయితే చెరువులు, కుంటలను నింపుకునే వీలు కలుగుతుందన్నారు. ఎడమ కాలువలో 56 కి.మీ మైనర్ కెనాల్స్ పూర్తి కావాలని, అందుకు సంబంధించిన ఎస్‌డీఆర్ అందజేయాలని అధికారులను ఆదేశించారు.

రంగనాయకసాగర్ డెలివరీ సిస్టమ్...
మే చివరి నాటికి పూర్తి చేయాలి
సొరంగం నుంచి రిజర్వాయర్‌లోకి నీటిని పంపించే డెలివరీ సిస్టమ్‌ను మే చివరి నాటికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. రిబిట్‌మెంట్ పనులు పది రోజుల్లో పూర్తి కావాలని అధికారులను ఆదేశించా రు. రంగనాయకసాగర్ ప్రధాన కాలువలు, కుడి ఎడ మ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు రాకపోకలకు వీలుగా ఉండే విధంగా నిర్మిస్తున్న కాలువల మీద బ్రిడ్జిల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. సమీక్షలో జేసీ పద్మాకర్, ఎస్‌ఈ ఆనంద్, ఈఈ రవీందర్‌రెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఈ ప్రసాద్, తహసీల్దార్ విజయ్, ఇరిగేషన్ అధికారి మహ్మద్‌ఖాజా, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, మెగా కంపె నీ ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, నంగునూరు ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోంరెడ్డి, మాజీ ఎంపీపీ రామచంద్రం, సొసైటీ చైర్మన్లు కీసరి పాప య్య, కోల రమేశ్‌గౌడ్, పాల సాయిరాం, దువ్వల మల్ల య్య, ఆంజనేయు లు, మల్లేశం, నవీన్ ఉన్నారు.

ఆర్‌అండ్‌ఆర్ పనుల జాప్యంపై సమీక్ష
అనంతగిరి రిజర్వాయర్‌లో అల్లీపూర్, కొచ్చగుట్టపల్లి, ఎల్లాయిపల్లి తదితర గ్రామాల్లో కొన్ని ఇండ్లు ముం పునకు గురవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభు త్వం ఆర్‌అండ్‌ఆర్ పథకంలో 250చదరపు గజాల స్థలంలో ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అల్లీపూర్‌లో నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారు. మెట్టుబండల సమీపంలో నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణాల జాప్యంపై ఎమ్మెల్యే ఆరా తీశారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...