ఇంటర్... ఫలితాలొచ్చాయి


Thu,April 18, 2019 11:40 PM

సంగారెడ్డి చౌరస్తా: ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా వి ద్యార్థులు వెనుకంజలో పడ్డారు. మొదటి సంవత్సరంలో 49 శాతం, ద్వితీయ సంవత్సరంలో 53 శాతం తో సరిపెట్టుకున్నారు. రెండేండ్ల కంటే ఈసారి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థానం మరింత పడిపోయింది. మొదటి సంవత్సరం జనరల్ (రెగ్యులర్, ప్రైవేటు) ఫలితాల్లో 49 శాతం ఫలితాలు రాగా, ద్వితీయ సంవత్సరం జనరల్ (రెగ్యులర్, ప్రైవేటు) విద్యార్థులు 53 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో మొదటి సంవత్సరంలో 54 శా తం సాధించి రాష్ట్ర స్థాయిలో 18వ స్థానానికి పడిపోగా, ద్వితీయ సంవత్సరంలో 69 శాతం ఉత్తీర్ణతతో 17వ స్థానానికి ఫలితాలు పడిపోయాయి. మొత్తం మీద అన్ని కేటగిరీలలో గతేడాది కంటే ఈసారి రాష్ట్ర స్థాయిలో జి ల్లా వెనుకంజలో పడిపోవడం గమనార్హం. ఇదిలా ఉం డగా ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. రెగ్యులర్ ఫలితాల్లో భాగంగా మొదటి సంవత్సరంలో బాలురు 48 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 49 శాతం ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో బాలురు 49 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 57 శాతం ఉత్తీర్ణత సా ధించి బాలుర కంటే 8 శాతం అధిక ఉత్తీర్ణతను నమో దు చేసి మరోసారి తమ సత్తాను చాటారు. గురువారం సాయంత్రం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల వివరాలు జిల్లాలో ఈవిధంగా ఉన్నాయి.

జనరల్ కేటగిరీలో...
జనరల్ (రెగ్యులర్, ప్రైవేటు) ఇంటర్మీడియట్ ఫలితాల్లో భాగంగా మొదటి సంవత్సరంలో మొత్తం 14,241 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, కేవలం 6,918 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 7,558 మందికి గాను 3,631 మంది ఉత్తీర్ణులై 48 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 6,683 మందికి గాను 3,257 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో మొత్తం 10,970 మం ది విద్యార్థులు పరీక్ష రాయగా, 5,831 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 53 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇం దులో బాలురు 5,435 మందికి గాను 2,670 మంది ఉత్తీర్ణులై 49 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 5,535 మందికి గాను 3,161 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 57 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది ఫలితాల (2017 -2018)తో పోల్చితే ఈ సారి ద్వితీయ సంవత్సరంలో 6 శాతం ఫలితాలు పడిపోయాయి. గతేడాది రాష్ట్ర స్థాయిలో 21వ స్థానంలో నిలువగా, ఈసారి 24వ స్థానానికి ఫలితాలు పడిపోయాయి. మొదటి సంవత్సరంలోనూ గతేడాది 52 శాతం ఫలితాలు వస్తే ఈ సారి 49 శాతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఒకేషనల్ కేటగిరీలో...
ఒకేషనల్ కోర్సు ఫలితాల్లో భాగంగా మొదటి సంవత్సరంలో మొత్తం 1,009 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, కేవలం 542 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 54 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 485 మందికి గాను 234 మంది ఉత్తీర్ణులై 48 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 24 మందికి గాను 306 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 59 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు బాలుర కంటే 11 శాతం అధిక్యతలో నిలిచారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో మొత్తం 706 మంది విద్యార్థులు పరీక్ష రాయ గా, 486 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 69 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 348 మందికి గాను 215 మంది ఉత్తీర్ణులై 62 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 358 మందికి గాను 271 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 76 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది ఫలితాల (2017 -2018)తో పోల్చితే ఈ సారి ద్వితీయ సంవత్సరంలో 4 శాతం ఫలితాలు పడిపోయాయి. గతేడాది రాష్ట్ర స్థాయిలో 11వ స్థానంలో నిలవగా, ఈసారి 17వ స్థానానికి ఫలితాలు పడిపోయా యి. మొదటి సంవత్సరంలోనూ గతేడాది 63 శాతం ఫలితాలు వస్తే ఈ సారి 54 శాతం ఫలితాలు నమోదు అయ్యాయి. ఈ ఫలితాల్లో గతేడాది రాష్ట్ర స్థాయిలో 8వ స్థానంలో నిలిస్తే ఈ సారి 18వ స్థానానికి ఫలితాలు పడిపోవడం గమనార్హం.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...