ఘనంగా సీతారాముల రథోత్సవం


Thu,April 18, 2019 11:39 PM

- ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
జిన్నారం : మంగంపేటలోని సీతారామచంద్రస్వామి దివ్య రథోత్సవం గురువారం ఘ నంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలోల నిర్వహించిన రథోత్సవం నిర్వహించా రు. రథోత్సవంలో సీతరామలక్ష్మణులను గ్రామంలోని వీధుల్లో నాలుగు వైపుల ఊరేగించారు. దివిటీలు, భాజ చప్పుళ్ల మధ్య అంగరంగ వైభవంగా రథోత్సవం జరిగింది. మహిళలు మంగళహారతులతో ఎదురొచ్చి సీతారాములకు పూజలు చేశారు. భజన క మిటీ ఆధ్వర్యంలో రథోత్సవంలో కోలాటాలు నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ ఊరేగింపును ఉత్సాహంగా నిర్వహించారు. అంతకు ముందు ప్రత్యేక సేవా కార్యక్రమాలు, ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు జరిపారు. రథోత్సవానికి ఎమ్మెల్యే గూ డెం మహిపాల్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్నిలాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంగంపేటలో సీతారాముల ఉత్సవాలు ఘనంగా జ రుగుతాయని నా చిన్నప్పటి నుంచి వింటున్నానని చెప్పారు. మంగంపేటకు, రామాలయానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. ఎమ్మెల్యేగా ప్రతి సంవత్సరం ఉత్సవాలకు హాజరువుతుండడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గ్రామస్తులందరూ కలిసి ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రభాకర్, టీఆర్‌ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, సర్పంచ్ ప్రశాంతినరేందర్, మాజీ సర్పంచ్ మల్లేశ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఒందరి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి మన్నె మహేందర్, అవుసుల భిక్షపతి, ఉప సర్పంచ్ నా గరాజు, ఊట్ల సర్పంచ్ కొరివి ఆంజనేయులు, మాజీ సర్పంచ్ శివరాజ్, గడ్డపోతారం మాజీ సర్పంచ్ ఎంపీ అశోక్, గ్రామ నాయకులు శివుడు, రఘు, రవి, గణేశ్, రతన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...