ఎన్నిక ఏదైనా.. టీఆర్‌ఎస్‌దే విజయం


Wed,April 17, 2019 11:35 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండానే... ఏ విజయమైన టీఆర్‌ఎస్‌దే... సిద్దిపేట నియోజక వర్గంలోని 5 జడ్పీటీసీలు, 45 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొంది రాష్ట్రంలోనే సిద్దిపేట ను ఆదర్శంగా నిలిచేలా అందరు పని చేయాలని మా జీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ సంఘంలో చిన్నకోడూరు, నంగునూరు మండలాల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ శ్రేణులతో సన్నాహాక సమావేశం నిర్వహించారు.

సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అన్నింటా టీఆర్‌ఎస్ విజయం సాధించాలన్నారు. గ్రామ అధ్యక్షుడు, సర్పంచ్, ఇతర నాయకులతో కలిసి అభ్యర్థి ఎవరన్నది నిర్ణయం తీసుకుని.. ఐక్యతక మారు పేరుగా నిలువాలని కోరారు. నేనెప్పుడు కోరుకునేది ఒక్కటే.. కార్యకర్తలు.. నేను ఒక కుటుంబం. ఆ కుటుంబంలో అందరూ బాగుండాలని అనుకుంటా.. అలానే అందరూ ఉండాలన్నది నా ఆలోచన అన్నారు. గ్రామంలో అందరు సమన్వయంతో పనిచేసి ఒక వ్యక్తిని ఎలాంటి బేధాభిప్రాయా లు రాకుండా అభ్యర్థిని నిర్ణయించుకోవాలన్నారు. పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే వారికి పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి.. అప్పుడే పార్టీ కార్యకర్తలకు మం చి గుర్తింపు వస్తుంది. ఎవరికీ టికెట్ ఇచ్చినా పార్టీకి కట్టుబడి పనిచేయాలి. పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో నా కోసం మీరు కష్టపడ్డారు.. ఈ ఎన్నికల్లో మీ అందరి కోసం కష్టపడి పని చేస్తానన్నారు. ఎంపీటీసీ అభ్యర్థి ఎంపిక పార్టీ కార్యకర్తల చేతుల్లో ఉంది. ఎవరిని సూచిస్తే వారికే టికెట్, లేదంటే పార్టీ సూచించిన వారికి గెలుపు కోసం పని చేయాలని సూచించారు.

పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు...
బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులు ఎంత భద్రంగా ఉంటాయని మీరు నిశ్చితంగా ఉంటారో.. నా గుర్తిం పు అలాగే ఉంటుందని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నా రు. ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందని, కష్టపడి పనిచేసేవారికి పదవి, గౌరవం ఇస్తామని భరో సా ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యద ర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సా రయ్య, ఎంపీపీలు మాణిక్యరెడ్డి, జాప శ్రీకాంత్‌రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మ న్లు ఎడ్ల సోంరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు వేముల వెం కట్‌రెడ్డి, సంగు పురేందర్, మాజీ ఎంపీపీ రామచం ద్రం, నాయకులు తడిసిన వెంకట్‌రెడ్డి, పాల సాయి రాం, కోమాండ్ల రామచంద్రారెడ్డి, దువ్వల మల్లయ్య, కిష్టారెడ్డి, కాముని శ్రీనివాస్, పోచబోయిన శ్రీహరియాదవ్, లింగంగౌడ్, కనకరాజు, పీఏసీఎస్ చైర్మన్లు రమేశ్‌గౌడ్, పాపయ్య తదితరులు ఉన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...