20 నుంచి బేతాళస్వామి జాతర


Wed,April 17, 2019 11:34 PM

అల్లాదుర్గం: భూత ప్రేత పిశాచాలకు రారాజు బేతాళుడు. అలాంటి బేతాళుడికి గుడి కట్టి నిత్యం పూజలు చేస్తున్నారు ఇక్కడి ప్రజలు. భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే బేతాళస్వామి ఉత్సవాలకు ముస్తాబైంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక బేతాలస్వామి దేవాలయంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. నిత్యం అనేకమంది భక్తులు ఆలయాన్ని సందర్శించుకుని స్వామి వారికి తమ మొక్కులు చెల్లించుకుంటారు. దశాబ్దాల చరిత్ర కలిగిన అల్లాదుర్గం బేతాళస్వామి జాతర 20 నుంచి 28 వరకు జరుగనున్నాయి. జిల్లాలోనే ఏడుపాయల జాతర తరువాత రెండో పెద్ద జాతరగా బేతాళస్వామి జాతర జరుగుతుంది.

ఆలయ చరిత్ర..
సుమారు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన బేతాళస్వామి ఆలయానికి తలుపులు ఉండకపోవడం విశేషం. పంచభూతాలకు అధిపతి అని అంటూ ఉంటారు. అందుకే నిరంతరం పంచభూతాలు తాకుతూ ఉండేలా విగ్రహం చుట్టూ గోడలు ఉండవు. కేవలం స్వామి విగ్రహం ఉన్న వెనుక భాగం మాత్రమే గోడ ఉంటుంది. గతంలో ఇక్కడి ప్రజలకు వింత రోగాలతో మృతి చెందేవారని చెపుతుంటారు. క్షుద్రశక్తులు, అంటురోగాలు ఆవరించిన వారికి భూతనాథుడు మామూలు మనుషులుగా చేస్తాడని నమ్మ కం. బేతాళస్వామి గుడిని నిర్మించి బేతాళుడిని మొక్కడం ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతీ సంవత్సరం జాతర నిర్వహిస్తారు.

ఏర్పాట్లు పూర్తి..
బేతాళస్వామి జాతర ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిం ది. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఆలయం వద్ద బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. తాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేసి నల్లా లు బిగించారు. భక్తుల సౌకర్యార్థం నూతనంగా షెడ్లను ఏర్పాట్లు చేశారు. జాతరలో పాల్గొనేందుకు మెదక్ జిల్లా నుంచే కాకుండా సంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. జాతరలో ఎలాంటి సంఘటనలు జరుగకుండా ఎస్‌ఐ మహ్మద్‌గౌస్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించనున్నారు.

జాతర కార్యక్రమాలు:
బేతాళస్వామి జాతర కార్యక్రమాలు 20న పోలేరమ్మ దేవతకు బోనాలు, 21న పోచమ్మ బోనా లు, 22న దుర్గమ్మ బోనాలు, 23న బేతాళస్వామికి బోనాలు, 24న సాయంత్రం 4 గంటలకు బేతాళస్వామికి బండ్ల ప్రదర్శన, 25న భజనలు, 26భాగోతాలు, 27న రాత్రి 8 గంటలకు లంకాదహనం, 28న స్వామివారికి బండ్ల ప్రదర్శన, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...