కొత్త కార్యదర్శులు విధులను సక్రమంగా నిర్వర్తించాలి


Tue,April 16, 2019 11:03 PM

అందోల్, నమస్తే తెలంగాణ: గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా తమ బాధ్యతలను, విధులను సక్రమంగా నిర్వర్తించాలని అందోలు ఎంపీడీవో సత్యనారాయణ సూచించారు. సోమవారం మండలంలో కొత్తగా పంచాయతీ కార్యదర్శులుగా బాధ్యతలను స్వీకరించిన వారితో జోగిపేటలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పరిపాలన వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కొత్తగా పంచాయతీ కార్యదర్శులను నియమించిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యదర్శులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయకూడదన్నారు. కార్యదర్శులుగా కేటాయించిన గ్రామాలలోని ప్రజలకు ప్రతిరోజూ అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యలను గుర్తించాలని ఆయన సూచించారు. అందోలు మండలానికి 14 మంది కొత్తగా కార్యదర్శులు రావాల్సి ఉండగా, సోమవారం 13 మంది విధుల్లో చేరారని, వారికి ఆర్డర్ కాపీలను అందజేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సూపరిండెంట్ అశోక్, సీనియర్ అసిస్టెంట్ శంకర్, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణారెడ్డి ఉన్నారు.

రాయికోడ్‌లో..
రాయికోడ్: మండలంలోని పలు గ్రామాల్లో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులలో కొత్తగా నియమితులైన పంచాయతీ కార్యదర్శులు రిపోర్టు చేశారని మండల అభివృద్ధి అధికారి స్టీవెన్‌నీల్ తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కరు చొప్పున పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం సోమవారం నియమించిందని స్పష్టం చేశారు.అందులో భాగంగా మండలంలోని సంగాపూర్ గ్రామానికి సుప్రియ, ధర్మాపూర్‌కు కృష్ణ, రాయిపల్లి(సి)కి పావని, ఇందూర్‌కు నాగరాజు, హస్నాబాద్‌కు పాండు, పాంపాడుకు సిద్ధమ్మ, అల్లాపూర్‌కు మల్లేశం, కుస్నూర్‌కు రాములు, ఉల్గెరకు రజినీకాంతం, మొరాట్గాకు యాదుల్, ఇటికేపల్లికి గౌసోద్దీన్, ఖామ్‌జమల్‌పూర్‌కు సంగమేశ్వర్, సీరూర్‌కు శారద, మహిబాత్‌పూర్‌కు అయూల్య, నల్లంపల్లికి పరమేశ్వరి నియామకపత్రాలు అందజేశారన్నారు. మండలంలో మిగిలిన గ్రామాలకు నియమించిన పంచాయతీ కార్యదర్శులు మంగళవారం మండలానికి రానున్నారన్నారు. వారందరూ విధుల్లో చేరితే పంచాయతీల్లో ఇబ్బందులు తొలిగిపోతాయని స్పష్టం చేశారు.

హత్నూరలో..
హత్నూర: హత్నూర మండలానికి 17మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు కొత్తగా నియమింపబడ్డారని ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. కాగా మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలకు ఎంపికైన గ్రామ కార్యదర్శుల ధ్రువపత్రాలు పరిశీలించడం జరుగుతుందని త్వరలో విధుల్లో చేరడానికి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. కాగా తెల్లరాళ్లతండా గ్రామ పంచాయతీకి సంగీత, శేర్కాన్‌పల్లికి ఎండీ మజార్‌అలీ, చీక్‌మద్దూర్‌కు నవోద్‌రెడ్డి, ముచ్చర్లకు రాణిహంసలేఖ, లింగాపూర్‌కు చంద్రశేఖర్, నస్తీపూర్‌కు శ్రీనివాసులు, చందాపూర్‌కు ప్రసాద్, కొడిపాక రామ్‌చరణ్‌తేజ, లక్మాతండాకు సుధాకర్, మల్కాపూర్‌కు సాయిసంతోషి, కోనంపేటకు ప్రనన్య జ్యోతి, దేవునిగుట్టతండాకు ఎండీ ఇస్మాయిల్, బ్రాహ్మనగూడకు రఘువీర్‌గౌడ్, మంగాపూర్‌కు ప్రదీప్, నాగుల్‌దేవులపల్లికి శ్రీశైల భ్రమరాంభ, సాదుల్లానగర్‌కు సుల్తానా, మాధురకు అనురాధలు గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా నియమింపబడ్డారు. కాగా మండలానికి మరో 8 మంది గ్రామ కార్యదర్శులు వస్తారని వివరించారు.

పుల్కల్ మండలంలో..
పుల్కల్: మండలానికి 25 మంది పంచాయతీ కార్యదర్శులను కేటాయించారని వీరిలో 18 మంది విధుల్లో చేరాని ఎంపీడీవో సాయి ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల్లో పటిష్టమైన పాలన అందించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ కార్యదర్శులను నియమించింది. మండలంలో నూతన పంచాయతీలు ఏర్పాటు చేయడంతో 25 పాత పంచాయతీలకు తోడు నూతనంగా 9 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. దీంతో 34 గ్రామ పంచాయతీలకు గాను ప్రస్తుతం 9 మంది పంచాయతీ కార్యదర్శులున్నారు. నూతనంగా పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం నియమించడంతో మండలానికి మరో 25 మంది పంచాయతీ కార్యదర్శులు సోమవారం విధుల్లో చేరారు. దీంతో మండలంలో ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...