20 నుంచి వరి కొనుగోలు కేంద్రాలు


Tue,April 16, 2019 11:03 PM

సంగారెడ్డి చౌరస్తా: జిల్లాలో ఈ నెల 20 నుంచి వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయని జేసీ నిఖిల పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో వరి కొనుగోలు కేంద్రాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐకేపీ, డీఆర్డీఏ ద్వారా 3 కేంద్రాలు, పీఏసీఎస్ ద్వారా 36 కేంద్రాలలో కొనుగోలు మొదలవుతుందని వివరించారు. కొనుగోలు కేంద్రాలలో కనీస వసతులైన తాగునీరు, టెంట్, టార్ఫాలిన్లు, గన్నీ బ్యాగులు మొదలైన సౌకర్యాలు కల్పించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సీజన్‌లో మద్దతు ధర గ్రేడ్-ఏ వరి రకం క్వింటాల్‌కు రూ.1,770లను, సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1,750లను నిర్ణయించిందని స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో సుమారు 40 వేల టన్నుల వరి ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు. కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని 15 బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో డీసీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం సుగుణభాయి, డీసీవో, పీఏసీఎస్, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...