పరిషత్ ఎన్నికల అధికారులకు శిక్షణ


Tue,April 16, 2019 11:02 PM

సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ: జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుల ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిపికేషన్ విడుదల చేయడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రిటర్నింగు, అసిస్టెంట్ రిటర్నింగు అధికారులుగా నియామకమయ్యే ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జడ్పీ సీఈవో రవి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం సంగారెడ్డి డివిజన్ పరిధిలోని అధికారులకు మధ్యాహ్నం వరకు శిక్షణ శిబిరం నిర్వహించారు. భోజన విరామ సమయం అనంతరం జహీరాబాద్, నారాయణఖేడ్ డివిజన్లలో విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేస్తూ పరిషత్ ఎన్నికల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లా ప్రాదేశిక సభ్యులు, మండల ప్రాదేశిక సభ్యుల నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల కౌంటింగు వరకు నియామకం అయిన అధికారులు ఎన్నికల ఆదేశాలను పాటించి విధులు నిర్వహించాలన్నారు.

ముఖ్యంగా పరిషత్ ఎన్నికలలో బ్యాలెట్ పేపరుతో ఎన్నికలు నిర్వహిస్తునట్లు ఎన్నికల సంఘం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందేనని గుర్తుచేశారు. జడ్పీటీసీ సభ్యుల ఎన్నికకు తెల్లని బ్యాలెట్ పేపరు, మండల ప్రాదేశిక సభ్యుని ఎన్నికకు గులాబీ రంగు పేపరును ఎన్నికల అధికారులు ఎంపిక చేశారన్నారు. 25 జడ్పీటీసీ, 295 ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు జరునున్నాయి. ఎన్నికలు మూడు విడుతల్లో నిర్వహించనున్నారని, తొలి విడుత ఎన్నికలకు ఈనెల 22 నుంచి నామినేషన్లు ప్రారంభమై 28విత్‌డ్రాలతో ముగినున్నాయని తెలిపారు. రెండో విడుత ఈనెల 26 నుంచి నామినేషన్లు అరంభమై వచ్చే నెల 2నవిత్‌డ్రాలతో ముగియనున్నాయి.

మూడో విడుత ఎన్నికలు ఈనెల 30 నుంచి వచ్చే నెల 6వరకు ఎన్నికల విత్‌డ్రాలు ఉంటాయని అధికారులకు వివరించారు. నామినేషన్ల విత్‌డ్రాల అనంతరం బరిలో ఎంతమంది అభ్యర్థులు ఉంటారో వారి వివరాలు, గుర్తులను తొలి విడుతలో పోటీలో నిలిచిన అభ్యర్థుల ప్రకటన ఈ నెల 28న మధ్యాహ్నం 3 గంటల తర్వాత, రెండో విడుత అభ్యర్థుల ప్రకటన వచ్చేనెల 2న, మూడో విడుత బరిలో ఉన్న అభ్యర్థుల ప్రకటన, వచ్చేనెల 6న జాబితా ప్రకటిస్తారని ఆయన సూచించారు. ఎన్నికలు వచ్చేనెల 6న తొలి విడత, మలి విడత 10న, తుది విడత 14న జరుగుతాయని శిక్షణ శిబిరంలో రిటర్నింగు అధికారులకు వివరించారు. ఎన్నికల్లో అక్రమాలకు తావులేకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవరించి ఎన్నికలు సజావుగా జరిపించాలని అధికారులను సీఈవో కోరారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...