పార్టీల చిహ్నాలతోనే ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికలు


Tue,April 16, 2019 01:14 AM

మెదక్, నమస్తే తెలంగాణ : పార్టీల చిహ్నాలతో ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. మే మాసంలో జరుగబోయే ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, మాస్టర్ శిక్షకులకు జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో ఆడిటోరియంలో సోమవారం ఒకరోజు శిక్షణ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల్లో ఆయా పార్టీల గుర్తులతోనే ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని, పార్టీ బీ-ఫారం ఇచ్చిన అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయించడం జరుగుతుందని వివరించారు. ఎంపీటీసీగా పోటీచేసే అభ్యర్థి ఏ మండలం వ్యక్తి అయినా పోటీ చేయవచ్చని తెలిపారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి ఎన్నికల నిర్వహణకై ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలని, ఎన్నికల ఖర్చు వివరాలు రోజువారీగా తెలియజేయాలన్నారు.

పోటీచేసే అభ్యర్థి కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలని, అలాగే రూరల్ ఓటర్ లిస్టులో తప్పనిసరిగా వారి పేరు ఉండాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలబరిలో మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లు అనర్హులు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో లక్ష్మీబాయి, డీపీవో హనోక్, జిల్లా మైనింగ్ అధికారి జయరాజు, సీపీవో శ్రీనివాసులు, ఎస్సీ కార్పొరేషన్ అధికారి దేవయ్య, ఎస్టీ కార్పొరేషన్ అధికారి వసంతరావు, డీఎస్‌వో రాజిరెడ్డి, ఎంపీడీవో రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...