నేడు పాలిసెట్


Tue,April 16, 2019 01:14 AM

మెదక్, నమస్తే తెలంగాణ : పాలిటెక్నిక్ 2019-20 విద్యాసంవత్సరం ప్రవేశాలకు గానూ నేడు జరిగే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల, సిద్ధార్థ పాఠశాలలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1400 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని పభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పరీక్షల రిజీనల్ కో-ఆర్జీనేటర్ డాక్టర్ సువర్ణలత విలేకరులకు తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి గంటముందే అనుమతించబడుతుందని, నిమిషం ఆలస్యమైన అనుమతిలేదన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్లు, హెచ్‌బీ పెన్సిల్, పెన్ను వెంట తెచ్చుకోవాలన్నారు. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవన్నారు. తొలిసారిగా విద్యార్థుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన యాప్‌తో ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...