తలరాతను మార్చేది చదువు ఒక్కటే..


Sun,April 14, 2019 11:51 PM

-ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలి
-రాబోవు తరాలకు మాణిక్యాలను అందించాలి
-అంబేద్కర్ జయంతి వేడుకల్లో కలెక్టర్ హనుమంతరావు
సంగారెడ్డి టౌన్ : తలరాతలను మార్చేది చదువు ఒక్కటేనని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఆదివారం డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 128వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జిల్లా గ్రంథాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ తీశారు. కలెక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ చదువు లేకపోవడం వల్లే వివక్షత ఇంకా కొనసాగుతుందన్నారు. చదు వు నేర్చుకుని ఉన్నత స్థానాలకు ఎదిగిన వారికి గౌరవం దక్కుతుందన్నారు. కులం ద్వారా కాకుండా చదువు ద్వారానే ఎనలేని గౌరవం దక్కుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించి వారు ఉన్నత స్థానాలకు వెళ్లేలా కృషి చేయాలని సూచించారు. చిన్నతనం నుంచే మహనీయుల జీవిత చరిత్రలను, వారు అనుభవించిన బాధలను పిల్లలకు వివరించాల ని, అప్పుడే భవిష్యత్ తరాలకు ఆణిముత్యాలను అందిస్తామన్నారు. చదుకునేందుకు ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలన్నారు. అంబేద్కర్ చదువు సమీకరించు చదివించు అనే నినాదంతో ముం దుకు వెళ్లడం వల్లే ఆయన ప్రపంచం గర్వించే స్థాయికి చేరుకున్నారన్నారు. అంబేద్కర్ ఓ కులానికో, వర్గానికో చెందిన వాడు కాదని ప్రపంచానికి దిక్సూచి అని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందు కు తీసుకువెళ్లాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సూచించారు.

అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
- ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ప్రతి సంవత్సరం వారి ఆశయాల గురించి మాట్లాడుకోవడం మర్చిపోవడం జరుగుతుందని, అలా కాకుండా ఆచరణ ఎలా, వచ్చే సంవత్సరం పాటు ఎలా ముందుకు వెళ్లాలో నిర్దేశించుకోవాలన్నా రు. ముఖ్యంగా అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రభుత్వం తరపున పోలీసు, రెవెన్యూ శాఖలు ప్రముఖ పాత్ర వహిస్తాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పరిష్కరించడం, బాధితులకు నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎవరైనా బాధితులు మరణిస్తే వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా కలెక్టర్‌కు రిపోర్టు ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకు ముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ వేడుకల్లో చిన్నారి రాశి పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కళామండలి సభ్యులు పాడిన గీతాలు అలరించాయి.

వివిధ సంఘాలు నాయకుల నివాళి..
డా. బీఆర్. అంబేద్కర్ 128జయంతి సందర్భంగా మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జాయింట్ కలెక్టర్ నిఖిల, మున్సిపల్ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి సోషల్‌వెల్ఫేర్ డీడీ శ్రీధర్ అధ్యక్షత వహించగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబురావు, ఎస్టీ వెల్పేర్ అధికారి మణెమ్మ, డిఎస్పీ శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్ పరమేశం, దళిత సంఘాల నాయకులు పి.రామారావు, అనంత య్య, ఎ.మానిక్యం, ఎం. అడివయ్య, నాగయ్య, రమేశ్‌గౌడ్, కూనవేణు గోపాల కృష్ణ, కోటయ్య, వైద్యనాథ్, చంద్రయ్య, ముప్పా రం ప్రకాశ్, నాగరాజు, పోలీసు రాంచంద్రయ్య, కెంపుల రాజు తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...