గీతమ్‌లో ఘనంగా విజేతల దినోత్సవం


Mon,March 25, 2019 11:51 PM

పటాన్‌చెరు రూరల్, నమస్తే తెలంగాణ : గీతమ్ డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, గీతమ్ హైదరాబాద్ బిజినెస్ స్కూల్ (జీహెచ్‌బీఎస్)లు సోమవారం సంయుక్తంగా విజేతల దినోత్సవాన్ని (ఆచీవర్స్ డే) ఘనంగా నిర్వహించాయి. ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన ఇంజనీరింగ్, మెనేజ్‌మెంటు విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశాయి. 2018-19 విద్యా సంవత్సరంలో దాదాపు 120 దేశీయ, బహుళజాతీ కంపెనీలు హైదరాబాద్ గీతమ్‌లో ప్రాంగణ నియామకాలను నిర్వహించి, 85 శాతం మంది బీటెక్, ఎంటెక్, ఎంబీఏ విద్యార్థులను ఎంపి చేసినట్టు గీతమ్ వర్గాలు తెలిపాయి. దాదాపు 150 మంది విద్యార్థులు ఒకటికంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికైనట్టు పేర్కొన్నారు. అమెజాన్ రూ. 16.05 లక్షల గరిష్ఠ వార్షిక వేతనంతో గీతమ్ విద్యార్థులను ఎంపిక చేసింది. ఎజిలిటెక్స్ రూ.8 లక్షలు, టీవీఎస్ మోటర్స్ 7.9 లక్షలు, డీబీఎస్ 7.02 లక్షలు, క్యాపిటల్ ఫస్ట్ రూ. 7 లక్షలు, యురేనాక్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ రూ.6.99 లక్షలు, ఓపెన్‌టెక్ట్, మహీంద్రా ఫైనాన్స్‌లు రూ.6.8లలు, ఆప్టమ్, హోస్ట్ ఎనలిటిక్స్, నెస్లేలు రూ.6.5లక్షలు, కేక టెక్నాలజీస్, ఓఎస్‌టీసీ, అంబుజా సిమెంట్స్, డెల్లాయిట్‌లు రూ.6లక్షల చొప్పున, బర్కాడీయా రూ. 5.71 లక్షలు, హిటాచీ కన్సల్టింగ్ రూ.5.5 లక్షల వార్షిక వేతనాలతో గీతమ్ విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. అమెజాన్ ఇంటర్న్‌షిప్ నెలకు రూ.45 వేలు ఆఫర్ చేసినట్టు వివరించాయి. ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 105 మంది గీతమ్ హైదరాబాద్ విద్యార్థులను ప్రాంగణ నియామకాల ద్వారా ఎంపిక చేసుకుంది. విప్రో 41మందిని, వాల్యూమెమొంటస్, జెన్‌పాక్ట్ డిజిట్‌లు ఒక్కోక్కటి 36మంది చొప్పున, సింథేల్ 28మంది, వర్ఛూషా, మైండ్ ట్రీలు ఒక్కోక్కటి 23 మంది చొప్పున, ఎన్‌టీటీ డేటా 20మంది, మ్యూసిగ్మా 12 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్టు గీతమ్ అధికారులు తెలిపారు.

ఆచీవర్స్‌డే సంబురాలు...
గీతమ్‌లో భారీ ఎత్తున ప్రాంగణ నియామకాలు జరుగడంతో ఆచీవర్స్‌డే చొప్పున సంబురాలను నిర్వహించుకున్నారు. గీతమ్‌లోని శివాజీ ఆడిటోరియంలో జరిగిన ఆచీవర్స్‌డే సంబురాలకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్టు చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ వెంకటేశ్ పాలబొట్ల పాల్గొని విద్యార్థులకు నియామక ఉత్తర్వ్యులు అందజేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేసే ఉద్యోగాన్ని ప్రేమించాలని అటువంటప్పుడే మంచి పనితీరును మనం కనబర్చుతామన్నారు. నలుగురితో కలిసి పనిచేయాలని, నిత్య విద్యార్థిగా ఉండాలని సూచించారు. మంచి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గీతమ్ ప్రో వైస్ ఛాన్స్‌లర్ ఎన్ శివప్రసాద్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు మారిపోతున్నదన్నారు. దానిని అందిపుచ్చుకుని మంచి ఉపాధి అవకాశాలు పొందాలని, నిత్య విద్యార్థిగా అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కోరారు. అధ్యాపకుల కృషి, విద్యార్థుల పట్టుదల ప్రాంగణ నియామకాల్లో గీతమ్‌ను అగ్రస్థానంలో నిలబెడుతున్నదన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌బీఎస్ డీన్ అండ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై లక్ష్మణ్‌కుమార్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్ డైరెక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్, ప్రొఫెసర్ కే అక్కలక్ష్మీ, గీతమ్ రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీహెచ్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...