అన్ని వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయం


Mon,March 25, 2019 12:13 AM

సిద్దిపేట టౌన్ : వెనుకబడ్డ కులాల్లో సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర మోచీ సంక్షేమ సంఘం మొదటి వార్షికోత్సవ సభ ఆదివారం జరుగగా, హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మోచీ సంఘం రాష్ట్ర వార్షికోత్సవం సిద్దిపేటలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇక నుంచి సంఘం ఆర్థికంగా బలపడి కులస్తులందరికీ శుభం జరగాలని ఆకాంక్షించారు. ఏ ముఖ్యమంత్రి వెనుకబడ్డ కులాల కోసం చేయనటువంటి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ తెచ్చి, అమలు చేస్తూ వారిలో ఆత్మగౌరవాన్ని పెంచారన్నారు. వెనుకబడ్డ కులాల కోసం ప్రత్యేకంగా భవనాలు, స్థలాలు కేటాయించి, వారి అభివృద్ధికి కృషి చే స్తున్నారన్నారు. మోచీ కులస్తుల కోసం అబ్దుల్‌పుర వద్ద కేటాయించిన స్థల, భవనం అనువుగా లేదని కులస్తులు ఎమ్మెల్యే హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లడంతో మరో చోట కేటాయించేందుకు సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఆ సమస్య పరిష్కరిస్తామన్నారు. వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారి కోసం 90 నుంచి 95 శాతం వరకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తూ వారికి అండగా ఉంటుందన్నారు.

ఎస్సీ సబ్‌ప్లాన్ పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. లబ్ధిపొందిన వారికి కాకుండా నిజమైన పేదరికంలో ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు వర్తించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. సిద్దిపేట మోచీ సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు అందిస్తామన్నారు. అంతకు ముందు మోచీ సంఘం నాయకులు కేక్ కట్ చేసి వార్షికోత్సవ సంబురాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మోచీ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మోచీ సంఘం రాష్ట్ర అధ్యక్షు డు లక్ష్మీరాజం, ప్రధాన కార్యదర్శి బాలశంకర్, రిటైర్డ్ జేసీ గం గారాం, ఎస్సీ ఉప కులాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి వెంకటేశం, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మోచీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...