సత్తా చాటేలా సీఎం కేసీఆర్ సభ


Mon,March 25, 2019 12:13 AM

అల్లాదుర్గం : టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలతో భారీ సంఖ్యలో పాల్గొని టీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటుతామని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. సీఎం కేసీఆర్ 20 నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 3న సాయంత్రం 4.00 గంటలకు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ఎన్నికల ప్రచార సభను అల్లాదుర్గం మండల పరిధిలోని ఐబీ చౌరస్తా వద్ద స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌లు సభా స్థలంతో పాటు హెలీప్యాడ్, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సభను విజయవంతం చేసేందుకు మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల పరిధిలోని ఒక్కో నియోజకవర్గం నుంచి 30వేల మందిని తరలించే విధంగా కృషి చేయాలని కోరారు. ప్రతీ మండలం నుంచి 10 వేల మందిని తరలించాలన్నారు. జెడ్సీటీసీలు, ఎంపీపీలు, రైతు సమన్వయ సమితి కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సభకు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేసేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో జన సమీకరణ చేయాలన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ని 16 స్థానాల్లో గెలిపిస్తే ఢిల్లీలో మనగొంతు వినిపించవచ్చన్నారు. వచ్చే నెల 3న జరుగనున్న సీఎం కేసీఆర్ సభలో 3లక్షల మంది పాల్గొని సభను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకులు భిక్షపతి, మాజీ ఎంపీపీ కాశీనాథ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సుభాష్‌రావు, వట్‌పల్లి మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ ఆశోక్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు జైపాల్‌రెడ్డి, సిద్ధార్థరెడ్డి, బలరాం, నర్సింహులు, నారాయణ, పవన్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...