జహీరాబాద్‌లో కాంగ్రెస్ ఖతం


Sat,March 23, 2019 11:33 PM

జహీరాబాద్, నమస్తే తెలంగాణ: జహీరాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. జహీరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సభ్యులు సుభాశ్, కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షుడు ధనసిరి శ్రీనివాస్‌రెడ్డిలతో పాటు పలువురు హస్తం వీడి కారెక్కడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌లో అయోమయ పరిస్థితి నెలకొన్నది.

జహీరాబాద్ పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ సుభాశ్‌తో పాటు కౌన్సిలర్ జహంగీర్, నారాయణరెడ్డి, కాశీనాథ్, అరుణ్ కుమార్, అక్తర్ గోరి, కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షుడు ధనసిరి శ్రీనివాస్‌రెడ్డి, సత్వార్ సహకార బ్యాంకు చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, జహీరాబాద్ ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షుడు దశరథ్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డితో పాటు నాయకులు గుండురెడ్డి, వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి, జగన్నాథ్‌రెడ్డితో పాటు పలువు కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో ఎంపీ గెలుపు ఖాయమని పలువురు ముఖ్య నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్‌ఎస్ బలోపేతానికి కృషి...
జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ని బలోపేతం చేసేందుకు టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎండి. ఫరీదుద్దీన్, ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ వద్ద జరిగిన టీఆర్‌ఎస్ సన్నాహక సభలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. కేటీఆర్ సూచనతో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, ఎమ్మెల్యే మాణిక్‌రావులు పట్టుదలతో ఓటింగ్ శాతాన్ని పార్లమెంట్ ఎన్నికలో పెంచేందుకు కాంగ్రెస్ ముఖ్య నాయకులను టీఆర్‌ఎస్‌లో చేర్పించారు. పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ను తిరుగులేని శక్తిగా మార్చేందుకు పావులు కదుపుతున్నారు. జహీరాబాద్, మొగుడంపల్లి. కోహీర్, న్యాల్‌కల్, ఝరాసంగంతో పాటు జహీరాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అయ్యింది. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, జహీరాబాద్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంపీ బీబీ పాటిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ లకా్ష్మరెడ్డి, రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీద్, టీఆర్‌ఎస్ నాయకులు అరవింద్‌రెడ్డి, సుభాశ్‌రెడ్డి, మునీరుద్దీన్, పాండురంగారెడ్డి తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...