ప్రజలకు భరోసానిచ్చేందుకే కవాతు


Sat,March 23, 2019 11:33 PM

అందోల్, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ప్రత్యేక బలగాలతో కవాతును నిర్వహించినట్లు జోగిపేట సీఐ తిరుపతి రాజు తెలిపారు. శనివారం సాయంత్రం జోగిపేటలోని సీఆర్‌పీఎఫ్ దళాలతో పట్టణంలోని పురవీధుల్లో, ప్రధాన రహదారులపై కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కేంద్రం ప్రత్యేక బలగాలను కేటాయించిందన్నారు. జిల్లాకు కేటాయించిన కేంద్ర దళాలతో ఈ కవాతును నిర్వహిస్తున్నామని, వీరికి పట్టణంలోని పరిసర ప్రాంతాలపై అవగాహనను కలిగి ఉండాలని, ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు భద్రత, భరోసాను కల్పించేందుకు ఈ కవాతును నిర్వహించామన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలు భయాందోళనలకు, భయభ్రాంతులకు గురికాకుండా ఉండేందుకు ఈ కవాతు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ కవాతులో జోగిపేట ఎస్‌ఐ వెంకట రాజాగౌడ్‌లతో పాటు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.

ముమ్మరంగా వాహనాల తనిఖీ...
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జోగిపేట పట్టణంలో పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను నిలిపివేసి, తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా అక్రమంగా మద్యం, డబ్బు రవాణా చేయడాన్ని అరికట్టేందుకు గాను వాహనాలను తనిఖీ నిర్వహించినట్లు సీఐ తెలిపారు. అక్రమ మద్యం, డబ్బు రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...