తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం


Sat,March 23, 2019 11:33 PM

జహీరాబాద్, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ పై జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే గీతారెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, తగ్గిన బుద్ది చెపుతామని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. శనివారం జహీరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శుక్రవారం జహీరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే గీతారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య మంత్రి కేసీఆర్‌పై అర్ధరహిత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఆసరా పథకాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.?

ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేసేందుకు మిషన్ భగీరథ పథకం అమలుచేయడం జరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ లేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంట్ సరఫరా చేయడం కాంగ్రెస్ నాయకులకు తీరని శోకంగా మిగిలిందన్నారు. దేశంలోనే సీఎం కేసీఆర్ నంబర్ సీఎంగా ఉన్నారని, అభివృద్ధిని చూసి గీతారెడ్డి ఓర్వలేక ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పంటలు సాగు చేసేందుకు ఎకరాకు రూ. 8వేలు ఇవ్వడం, రైతులకు బీమా పథకాలు అమలు చేశారన్నారు. రైతులు చనిపోయిన వెంటనే కుటుంబానికి రూ. 5 లక్షలు ఆర్థిక సాయం చేయడం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఏప్రిల్ నుంచి పంట పెట్టుబడి ఎకరాకు రూ.10 ఇవ్వడంతో పాటు ఆసరా పింఛన్లు రూ. 2,016, దివ్యాంగులకు రూ.3,016కు పెంచడం జరుగుతుందన్నారు. జహీరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే గీతారెడ్డి సీఎం కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు మానుకోకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెబుతారని హెచ్చరించారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీపీ అధ్యక్షుడు చిరంజీవి, టీఆర్‌ఎస్ నాయకులు దశరథ్‌రెడ్డి, ఎంజీ.రాములు, వైధ్యనాథ్, అరవింద్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి, కుద్బుద్దీన్, తంజీం, మాణెమ్మతో పాటు పలువురు ఉన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...