మౌలిక సౌకర్యాలు బాగున్నాయా?


Sat,March 23, 2019 11:32 PM

పుల్కల్: పాఠశాలలో మౌలిక సౌకర్యాలు బాగున్నాయా ? తరగతి గదులు విద్యార్థులకు సరిపోతున్నాయా ? విద్యార్థులకు అక్షయ పాత్ర భోజనమా ? మహిళా ఏజెన్సీలతో వండిస్తున్నారా..? అని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ శనివారం మండల పరిధిలోని శివ్వంపేట ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి ఉపాధ్యాయులను ప్రశ్నించాడు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ శనివారం డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్ రెడ్డితో కలిసి శివ్వంపేట ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా వచ్చి పాఠశాల ఆవరణలో, తరగతి గదుల్లో కలియ తిరిగి పాఠశాలలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు. శివ్వంపేట పాఠశాలలో నూతనంగా 8 గదులను నిర్మించారు. అయితే కార్యాలయం, సిబ్బంది గది, ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్ శిక్షణకు సరిపోవడంతో అన్ని తరగతులకు నూతన భవనం సరిపోవడం లేదని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు పదో తరగతి పరీక్షల విధుల్లో ఉండటంతో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు ఖలీల్ ఎమ్మెల్యేకు పాఠశాల సమస్యలను వివరించాడు. పాఠశాలలు ఒంటిపూట కావడంతో ఎమ్మెల్యే వెళ్లిన సమయానికి పాఠశాలలో విద్యారులు లేరు.

దీంతో మధ్యాహ్న భోజనం వండిస్తున్నారా ? అని ప్రశ్నించగా అక్షయ పాత్ర భోజనం సరఫరా అవుతుందని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ చెప్పారు. విద్యార్థులు తినగా మిగిలిన అక్షయ పాత్ర భోజనాన్ని చూయించారు. అక్షయ పాత్ర మెనూలో ఏయే పదార్థాలుంటాయని ఎమ్మెల్యే అడుగగా అన్నం, సాంబర్, రోజుకో రకం కూర, స్వీటు లేదా అరటి పండు ఉంటుందని ఉపాధ్యాయులు తెలిపారు. అక్షయ పాత్ర భోజన నాణ్యంగా ఉండటమే కాకుండా విద్యార్థులకు సరిపోను మిగులుతుందని తెలిపారు. పాఠశాల ల్యాబ్‌ను పరిశీలించి విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయిస్తున్నారా ? పరికరాలన్నీ ఉన్నాయా ? అని ప్రశ్నించాడు. విద్యార్థులకు సమయపాలన ప్రకారం ల్యాబ్‌లుంటాయని ఉపాధ్యాయుడు తెలిపారు. కంప్యూటర్ గదిని కూడా పరిశీలిచారు. పదో తరగతి రాస్తున్న విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నాడు. అదనపు తరగది గదులు అవసరమని ఆత్మ కమిటీ డైరెక్టర్ అలీం ఎమ్మెల్యేను కోరారు. పాఠశాలకు ప్రహరీ లేదని తెలిపారు. పాఠశాల సమస్యలపై సవివరంగా నోట్ సిద్ధం చేసి ఇవ్వాలని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు ఖలీల్‌కు సూచించాడు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...