మండలి పోరు ప్రశాంతం


Sat,March 23, 2019 01:08 AM

సంగారెడ్డి చౌరస్తా: ఎమ్మెల్సీ ఎన్నికలకు తెర పడింది. శుక్రవారం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎమ్మెల్సీ స్థానాలకు గాను నిర్వహించిన పోలింగ్‌లో భాగంగా జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి 84.62 శాతం పోలింగ్ నమోదు కాగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి 59.52 శాతం పోలింగ్ నమోదైంది. డివిజన్ల వారీగా చూస్తే సంగారెడ్డి డివిజన్‌లో టీచర్ ఎమ్మెల్సీకి 80 శాతం పోలింగ్ నమోదు కాగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 58.85 శాతం పోలింగ్ నమోదైంది. నారాయణఖేడ్ డివిజన్‌లో టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి 86.88 శాతం పోలింగ్ నమోదు కాగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి 57.41 శాతం పోలింగ్ నమోదైంది. జహీరాబాద్ డివిజన్‌లో టీచర్ ఎమ్మెల్సీకి అత్యధికంగా 86.99 శాతం పోలింగ్ నమోదు కాగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కూడా అత్యధికంగా 62.3 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి 84.62 శాతం పోలింగ్ నమోదు కాగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి 59.52 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఒకేరోజు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 71 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కేంద్రాలు 35 కాగా, పట్టభద్రుల స్థానానికి సంబంధించి 36 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుకాకుండా పోలీసులు పూర్తి బందోబస్తు చేపట్టారు. పోలింగ్ ముగియగానే సిబ్బంది సహాయంతో అధికారులు బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి కరీంనగర్‌కు తరలించారు. ఈనెల 26న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. అదే రోజు అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. ఇదిలా ఉండగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలలో భాగంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 7 మంది అభ్యర్థులు, గ్రాడ్యుయేట్ స్థానానికి మొత్తం 17 మంది అభ్యర్థులు పోటీ పడిన విషయం తెలిసిందే. విజయం ఎవరిని వరించనున్నదో ఈ నెల 26 వరకు వేచి చూడాల్సిందే.

ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్....
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు తన ఓటు హక్కును వినియో గించుకున్నారు. స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కలెక్టర్ తన ఓటు వేశారు. అనం తరం పోలింగ్ నిర్వహణ తీరును పరిశీలించారు. ఓటర్ల కోసం కల్పించిన సౌకర్యాలపై సంబంధిత అధికారులతో ఆరా తీశారు. ఇదిలాఉండగా, సంగారెడ్డిలోని తారా కళాశాలలో అత్యధికంగా ఏర్పాటు చేసిన 6 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం నుంచి మాధ్యాహ్నం వరకు పెద్దమొత్తంలో ఓటర్లు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కళాశాల బయట నుంచి బైపాస్ రోడ్డు వరకు ఆయా అభ్యర్థులకు సంబంధించిన మద్దతుదారులు టెంట్లు వేసుకొని ఓటర్ల కోసం సహాయ కేంద్రాలని నిర్వహించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...