గర్భిణులకు సామూహిక సీమంతాలు


Sat,March 23, 2019 01:08 AM

పుల్కల్/రాయికోడ్/మునిపల్లి: ప్రభుత్వం నిర్వహిస్తున్న పోషన్ అభియాన్ పక్షోత్సవాల్లో భాగంగా నియోజకవర్గంలోని పలు మండలాల్లో గర్భిణులకు సామూహిక సీమంతాలు, పౌష్టికాహాంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పుల్కల్ మండల కేంద్రంతో పాటు పెద్దారెడ్డిపేట గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో జోగిపేట సీడీపీవో లక్ష్మీబాయి సమక్షంలో గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. అదేవిధంగా రాయికోడ్ మండల కేంద్రంలోని మొదటి అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్ కె.సక్కుబాయి ఆధ్వర్యంలో శుక్రవారం గర్భిణులకు సాముహిక సీమంతాలు, ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్న ప్రాసన, 3 సంవత్సరాల నిండిన చిన్నారులకు అక్షరభ్యాసం చేశారు. మునిపల్లి మండలం తక్కడపల్లిలో అంగన్‌వాడీ టీచర్లు గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. అదేవిధంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో జోగిపేట ఏసీడీపీవో ప్రియాంక, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ నాగమణి, ఏఎన్‌ఎం వసంత, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొనగా, రాయికోడ్‌లో జరిగిన కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు శోభారాణి, లలిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...