పోలీసు అభ్యర్థులకు ఫిట్‌నెస్ పరీక్షలు


Fri,March 22, 2019 12:56 AM

సంగారెడ్డి టౌన్: పోలీసు ఉద్యోగాల నియామకాల కోసం ఉమ్మడి మెదక్ జిల్ల్లా పరిధిలో నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గురువారం పట్టణంలోని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్న ఈవెంట్లకు 1000 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా అందులో 866 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థుల ధ్రువపత్రాలు అధికారులు పరిశీలించి కంప్యూటర్‌లో నమోదు చేశారు. అదే విధంగా వారికి దేహదారుఢ్య పరీక్షలతో పాటు వివిధ పరీక్షలు పరుగు, హైజంప్, లాంగ్‌జంప్, ఎత్తు, షాట్‌పుట్ వంటి పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అధికారులు నిర్వహించిన పరీక్షల్లో 456 మంది అభ్యర్థులు ఉద్యోగ నియామకాలకు అర్హత సాధించారని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. పట్టణంలోని పోలీసు పెరేడ్ మైదానంలో ఉదయం 5 గంటల నుంచి అభ్యర్థులకు వివిధ ఈవెంట్లలో పరీక్షలు నిర్వహించగా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైన ఈవెంట్లలో రన్నింగ్ పోటీలు, డిస్కస్ త్రో, హైజంప్, లాంగ్‌జంప్, చెస్ట్ పరీక్షలు చేశారు. అభ్యర్థులను పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు పక్కాగా నిర్వహించారు. అదే విధంగా శుక్రవారం 580 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పోలీసు అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు నేటితో ముగియనున్నాయని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...