ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తా


Thu,March 21, 2019 12:00 AM

సిద్దిపేట టౌన్ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తన కర్తవ్యా న్ని నిర్వర్తించా.. ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా అక్కడ వాలిపోయి పరిష్కరించా.. మిగిలిన సమస్యల పరిష్కార హామీతో మరోసారి మీ దీవెనల కోసం వస్తున్నా అంటూ మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో బుధవారం తెలంగాణ పీఆర్‌టీయూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా, శాసన మండలి చీఫ్ విప్‌గా పనిచేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించానన్నారు. ఉద్యమంలో సీఎం కేసీఆర్‌తో నడిచాం. ఉపాధ్యాయ, ఉద్యోగులు ఉద్యమంలోను భాగస్వాములు అయ్యారన్నారు. తెలంగాణ వచ్చే వరకు పోరాటం చేశాం. ఉద్యోగ, ఉపాధ్యాయ ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. 2015 పీఆర్‌సీ 43 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు పర్చామని ఆయన చెప్పారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు కడుపునిండా జీతాలను చెల్లించామన్నారు. ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్, ఇన్సెంటీవ్ చెల్లించామన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యాన్ని ఉద్యోగులకు అందించేందుకు హెల్త్‌కార్డులు అందించామన్నారు. మహిళా ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే చైల్డ్‌కేర్ సెలవులను 90 రోజులు మంజూరు చేశామని తెలిపారు. 2009 మ్యానిఫెస్టోలో మౌలిక సదుపాయాలు, పీఆర్‌సీ అమలు పర్చుతామని పేర్కొన్నారు. పీఆర్‌సీ నివేదిక జాప్యం అయినందు వల్ల ఐఆర్ మంజూరు కాలేదని, త్వరలోనే మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు.

డిగ్రీ, జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేసేందుకు 16 జీవో తెచ్చామని, దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించడంలో నిలిచిపోయిందన్నారు. మహిళా ఉద్యోగులకు ఇతర ఉద్యోగుల మాదిరిగానే ప్రసూతి సెలవులు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. విజ్ఞతతో ఓటర్లందరు ఆలోచించి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంతకు ముందు మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ ఈ నెల 22న జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాతూరి సుధాకర్‌రెడ్డికే మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో తెలంగాణ పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మారెడ్డి అంజిరెడ్డి, నాయకులు యాక మల్లు, శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రవీందర్‌గౌడ్, చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...