మిగిలింది మూడు రోజులే


Tue,March 19, 2019 11:27 PM

-ముహుర్తాలు చూసుకుంటున్నఅభ్యర్థులు
మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మెదక్ పార్లమెంట్ పరిధిలో రెండో రోజూ నామినేషన్లు ఎవరూ దాఖలు చేయలేదు. నామినేషన్లు ప్రారంభమై రెండు రోజులు పూర్తి అయినప్పటికీ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. సోమవారం ప్రారంభమైన నామినేష న్లు ఈ నెల 25న ముగుస్తాయి. పోటీ చేయాల్సిన అభ్యర్థులు నామినేషన్లు ఉదయం 11గంటల నుం చి మధ్యాహ్నం 3గంటల వరకు దాఖలు చేయవ చ్చు. 21,23,24 తేదీల్లో సెలవులు ఉండడంతో కేవ లం 3రోజులు మాత్రమే నామినేషన్లు వేయడానికి సమయం ఉంది. అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుంటూ నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. 22,25 తేదీల్లో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశలు ఉన్నాయి. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మూడు వాహనలు, నలుగురికి మాత్రమే ఎన్నికల కార్యాలయంలోకి అనుమతి ఉంది. వంద మీటర్ల దూరంలోనే వాహనాలను పోలీసులు నిలిపివేస్తారు. వాహనాల కోసం పోలీసులు ప్రత్యేక పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...