కొనసాగుతున్న దేహదారుఢ్య పరీక్షలు


Tue,March 19, 2019 11:25 PM

సంగారెడ్డి టౌన్ : పోలీస్ ఉద్యోగాల నియామకాల కోసం ఉమ్మడి మెదక్ జిల్ల్లా పరిధిలో నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం పట్టణంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్న ఈవెంట్లకు 1000 మంది అభ్యర్థులు హజరుకావాల్సి ఉండగా అందులో 872 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థుల ధ్రువపత్రా లు అధికారులు పరిశీలించి కంప్యూటర్‌లో నమోదు చేశారు. అదే విధంగా వారికి దేహదారుఢ్య పరీక్షలతో పాటు వివిధ పరీక్షలు పరుగు, హైజంప్, లాంగ్‌జంప్, ఎత్తు, షాట్‌పుట్ వంటి పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అధికారులు నిర్వహించిన పరీక్షల్లో 435 మంది అభ్యర్థులు ఉద్యో గ నియామకాలకు అర్హత సాధించారు. మరో 437 మంది ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో వెకనంజ పడ్డారని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి వివరించారు. పట్టణంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఉదయం 5.00 గం టల నుంచి అభ్యర్థులకు వివిధ ఈవెంట్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 5.00 గంటల నుంచి ప్రా రంభమైన ఈవెంట్లలో రన్నింగ్ పోటీలు, డిస్కస్ త్రో, హైజంప్, లాంగ్‌జంప్, చెస్ట్ పరీక్షలు చేశారు. అభ్యర్థులను పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు ప క్కాగా నిర్వహించారు. అదే విధంగా 20వ తేదీన 1000 మంది, 21వ తేదీన 1000 మంది, 22వ తేదీన 580మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...