ఆ ఇల్లు పట్టభద్రుల నిలయం..


Tue,March 19, 2019 11:25 PM

పటాన్‌చెరు రూరల్, నమస్తే తెలంగాణ : ఒక ఇంట్లో ఇద్దరు, లేదా ముగ్గురు పట్టభద్రులు ఉండటం మనం ఎక్కడైనా చూస్తాం. కానీ ఆ ఇంట్లో మాత్రం ఏకంగా పది మంది పట్టభద్రులు ఉన్నారు. ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికల సమయంలో ఈ విషయం వెలుగుచూసింది. పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామస్తులు ఆమీరుద్దీన్ (70) రిటైర్డ్ టీచర్. ఆయన సతీమణి అఖ్తర్ సుల్తానా (65) కూడా రిటైర్డ్ టీచర్. ఆ కాలంలోనే వారిద్దరు గ్రాడ్యుయేట్స్. వారు ఇద్దరు టీచర్లు కావడంతో తమ పిల్లలను బాగా చదివించారు. వారింటిని విద్యా నిలయంగా మార్చేశారు. వారి ప్రథమ కుమారుడు మీర్ మోహియుద్దీన్ బీఏ చదివి కాంట్రాక్టర్‌గా స్థిరపడ్డారు. మొదటి కూతురు సర్వర్ సుల్తానా ఎంఏ ఎంఈడీ చదివి ప్రభుత్వ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రెండో కూతురు మునవ్వర్ సుల్తానా ఎంఏ ఎంఈడీ చదివి ప్రభుత్వ టీచర్ వృత్తిలో స్థిరపడ్డారు. రెండో కుమారుడు రహీముద్దీన్ బీఎస్సీ చదివి ఎల్‌ఎల్‌బీ విద్యను అభ్యసిస్తున్నాడు. మూడో కూతురు అన్వర్ సుల్తానా బీఎస్సీ, బీఈడీ చదివి ప్రభుత్వ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నాలుగో కూతురు ఆమేనా సుల్తానా బీఏ బీఈడీ చదివి ప్రైవేటు టీచర్‌గా విధులు పనిచేస్తున్నారు. ఐదో కూతురు అయేషా సుల్తానా బీఎస్సీ, బీఈడీ చదివి ప్రభుత్వ టీచర్‌గా విధు లు నిర్వహిస్తున్నారు. వారి కోడలు ముదస్సీర్ ఫాతీమా, బీఏ చదివి గృహిణిగా ఉన్నారు. వీ రందరికీ కలిపి వారిం ట్లో పది పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. ఆమీరుద్దీన్ కుటుంబం మొత్తం గ్రాడ్యుయేట్లే ఉండటంతో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పిల్లలను క్రమశిక్షణతో పెంచడంతో పాటు వారికి ఉన్నత విద్యాభ్యాసం చేయిండంపై గ్రామస్తులు తరచు ఆయన్ని అభినందిస్తుంటారు. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో అందరి దృష్టి వారిపైనే. ఒకే ఇంట్లో పదిమంది గ్రాడ్యుయేట్‌స ఓట్లు ఉండటంతో ఇప్పటికే మీ ఓటు మాకే వేయాలనే విజ్ఞప్తులు ప్రారంభమయ్యాయి. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని మంచి నాయకుడిని ఎన్నుకుంటామని ఆ కుటుంబ సభ్యులు నమస్తే తెలంగాణకు తెలిపారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...