సమాచార హక్కు చట్టంపై అవగాహన తప్పనిసరి


Tue,March 19, 2019 11:24 PM

వట్‌పల్లి: సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే చంటిక్రాంతికిరణ్ అన్నారు. మంగళవారం వట్‌పల్లి మండలం పోతులబొగుడలో సమాచార హక్కు ప్రజా పరిరక్షణ సంక్షేమ సమితి క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా సమాజంలో ఎలాంటి అవినీతి జరుగకుండా ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే వీలుందన్నారు. ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని సమాచార హక్కు చట్టంద్వారా తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు ప్రజా పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు రాజేందర్, సభ్యులు శ్రీహరి, కుమార్, ఈశ్వరప్ప, శేఖర్, సాయిలు, సంతోశ్, రమేశ్ పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు భరోసా
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో భరోసాను ఇస్తుందని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. మంగళవారం మండలంలోని బుసారెడ్డిపల్లికి చెందిన కుమ్మరి నారాయణకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్నారన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని పేదలు కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వారికి డబ్బులు మంజూరు చెయ్యడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అల్లం నవాజ్‌రెడ్డి, రాష్ట్ర యువత విభాగం ప్రధాన కార్యదర్శి పైతర సాయికుమార్‌లు ఉన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...