అర్బన్ పార్కు ఏర్పాటుకు నిధులు మంజూరు


Mon,March 18, 2019 11:05 PM

-అర్బన్ పార్క్ నిర్మాణానికి రూ. 4 కోట్లు ..
-ప్రహరీ నిర్మాణానికి రూ. 90లక్షలు మంజూరు..
-మహీంద్రా ఆండ్ మహీంద్రా పక్కన స్థల సేకరణ
- పనులు చేసేందుకు సిద్ధమైన ఫారెస్ట్ అధికారులు
జహీరాబాద్, నమస్తే తెలంగాణ : జహీరాబాద్ పట్టణ ప్రజలకు ఆహ్లాద వాతావరణంతో పాటు పిల్లలు ఆడుకునేందుకు అర్బన్ పార్కు ఏర్పాటు చేసేందుకు సర్కార్ నిధులు మం జూరు చేసింది. పట్టణ సమీపంలో ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమ పక్కన ఉన్న అటవీ శాఖ అర్బన్ పార్కు ఏర్పాటు చేసేందుకు రూ.4 కోట్లు ప్రభుత్వం మంజూరు చే సింది. 65 జాతీయ పక్కన ఉన్న అటవీలో పార్కు ఏర్పా టు చేసేందుకు ఫారెస్ట్ అధికారులు టెండర్లు వేశారు. జాతీ య రహదారి పొడువున ప్రహారి నిర్మాణంతో పాటు చుట్టు కంచ ఏర్పాటు చేసేందుకు రూ.90 లక్షలతో టెండర్లు వేశా రు. టెండర్లు దక్కించుకున్న ట్రాక్టర్‌తో చేసే పనులు అప్పగించేందుకు ఫారెస్ట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 200 ఎకరాల్లో అర్బన్ పార్కు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జహీరాబాద్ సమీపంలో మహీంద్రా ఆండ్ మహీంద్రా పరిశ్రమ పక్కన ఈ అర్బన్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. 200 ఎకరాల్లో రూ.4 కోట్లుతో పార్కు నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనాలు సిద్ధం చేశారు. పార్కులో ఉదయం, సాయంత్రం ప్రజలు నడిచేందుకు కాలి నడక బాట ఏర్పాటుతో పాటు పిల్లలు అడుకోనేందుకు ఆహ్లాద వాతావరంతో పార్కు నిర్మా ణం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కాలినడక నడి చే వారికి మధ్యలో తాగునీరు, విశ్రాంతి తీసుకునేందుకు చె ట్లు ముందు కుర్చీలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి వాతావరణలో పార్కు నిర్మాణం చేసి ప్రజలకు విశ్రాంతి కోసం వచ్చి వారికి మంచి వాతావరణం కల్పించేందుకు ఫారెస్టు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

65 వ జాతీయ రహదారి పక్కన పార్కు ఏర్పాటు...
జహీరాబాద్ పట్టణ ప్రజలతో పాటు మహీంద్రా కార్మికుల కు, బుచినెల్లి, కాశీంఫూర్, బుర్థిపాడు, తూంకుంటతో పాటు పలు గ్రామాల ప్రజలకు మేలు కలిగేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు గతంలో జహీరాబాద్‌లో పర్యటించిన సమయంలో అర్బన్ పార్కు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీ మేరకు ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసింది. పార్కు నిర్మాణం కోసం ఫారెస్ట్ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ప్రభు త్వం పార్కు నిర్మాణం కోసం అనుమతి ఇవ్వడంతో అధికారులు పనులు చేసేందుకు టెండర్లు వేశారు. కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి, వానకాలం నాటికి పనులు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పార్కు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కన ఉండడంతో ముం బయి, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనదారులకు ఎంతో మేలు కలుగుతుందని ఫారెస్ట్ అధికారులు తెలుపుతున్నా రు. దూర ప్రయాణం చేసే ప్రయాణికులు కొద్ది సమయం విశ్రాంతి తీసుకునేందుకు వీలు కలుగుతుంది.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...