పారదర్శకంగా విధులు నిర్వహించాలి


Mon,March 18, 2019 11:04 PM

సంగారెడ్డి చౌరస్తా: ఎన్నికల్లో సెక్టోరియల్ అధికారులు తమ విధులను పారదర్శకంగా, శ్రద్ధతో నిర్వహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ నిఖిల సూచించారు. సోమవారం సాయంత్రం పాత డీఆర్డీఏ కార్యాలయంలో జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని సెక్టోరియల్ అధికారులకు ఈవీఎం, వీవీప్యాట్‌లపై సంపూర్ణ శిక్షణ అందించారు. ఈనెల 16న నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి గైర్హాజరైన 52 మంది సెక్టోరియల్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సెక్టోరియల్ అధికారులు ఈవీఎం, వీవీప్యాట్‌లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అన్నిఅంశాలపై పూర్తి అవగాహన ఉన్నపుడే ఈవీఎం, వీవీప్యాట్‌లకు సంబంధి ఎలాంటి సమస్య వచ్చినా వారే స్వయంగా పరిష్కరించవచ్చన్నారు. పోలింగ్ రోజున సెక్టోరియల్ అధికారుల పాత్ర చాలా ముఖ్యమైనదని, అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలన్నారు. సెక్టోరియల్ అధికారి తమ పరిధిలోని పోలింగ్ కేంద్రం ప్రిసైడింగ్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజున నిర్దేశించిన సమయానికి మాక్ పోలింగ్ తప్పనిసరిగా ప్రారంభం కావడంతో పాటు ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభించేలా చూడాలన్నారు. ఎన్నికల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసినపుడే ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. మాక్‌పోలింగ్ నిర్వహణ రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో నిర్వహించాలని పేర్కొన్నారు. మాక్‌పోల్ నిర్వహించిన అనంతరం ఈవీఎంలలో నమోదైన ఓట్లను వీవీప్యాట్‌లలోని స్లిప్పులను తొలిగించిన అనంతరం పోలింగ్ ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏవో గుండేరావు, సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...