పట్టణ పారిశుధ్యంపై కలెక్టర్ సీరియస్


Mon,March 18, 2019 11:03 PM

సంగారెడ్డి చౌరస్తా: చెత్త మనుషుల ప్రాణాలకే ముప్పు తెస్తుందని, పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో చెత్త చెదారంతో మురికి కూపంగా మారుతున్నదని సంబంధిత అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని బైపాస్ రోడ్డులోని పాత డీఆర్డీఏ కార్యాలయం సమీపంలోని ప్రాంతాలలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ ప్రాంతంలో పూర్తి చెత్త, చెదారంతో మురికికూపంగా ఉండటంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వారం రోజులుగా పేరుకుపోయిన చెత్త, మురికితో భయంకరమైన వాసన వెదజల్లుతున్నదని స్థానికులు మున్సిపల్ అధికారులకు చెప్పినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో వారి నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను అక్కడికి రావాలని ఆదేశించారు. వెంటనే అక్కడికి చేరుకున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్‌తో వారం రోజుల నుంచి చెత్త ఎక్కడికక్కడ వేయడమే కాకుండా చెత్తను ఎత్తకుండా అక్కడే ఉంచడానికి గల కారణాలపై ఆరా తీశారు. రోజూ చెత్తను తీస్తున్నట్టు అందుకు సమాధానం చెప్పడంపై కలెక్టర్ మండిపడ్డారు. తాను రోజు ఇదే దారిన వెళుతూ చెత్తను చూస్తున్నానని? అబద్దాలు చెప్పడం పరిపాటిగా మారిందని చురకలంటించారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేదని గుర్తు చేశారు. పారిశుధ్య నిర్వహణ లోపంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దని హితవు పలికారు. రేపటిలోగా చెత్తను తొలిగించి శుభ్రం చేయాలని, లేనిపక్షంలో తీవ్ర చర్యలు తప్పవని కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...