ఎమ్మెల్సీ శేరికి ఘన స్వాగతం


Mon,March 18, 2019 11:03 PM

మెదక్, నమస్తే తెలంగాణ : ఎమ్మెల్సీ శేరికి టీఆర్‌ఎస్ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత తొలిసారిగా సోమవారం మెదక్‌కు విచ్చేసిన ఆయనకు అడుగడుగునా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోదండ రామాలయానికి చేరుకోగానే మాజీ మున్సిపల్ చైర్మన్ చల్ల నరేందర్, ఆరునార్తి శేఖర్ పోద్దార్ నరేందర్, అయ్యవారి వెంకన్న, బాలగౌడ్ తదితరులు స్వాగతం పలికి పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. అనంతరం రామాలయ ప్రధాన పూజారి మధుసూదనాచారి, బ్రాహ్మణులు కృష్ణమూర్తిల వేద మంత్రోచ్ఛరణలతో పూర్ణకుంబంతో స్వాగతించి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు అందించారు. అనంతరం రామాలయ కమిటీ అధ్యక్షుడు బండ నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ ఆధ్వర్యంలో గజమాలతో సన్మానించారు. మెదక్, హవేళిఘనపూర్ మండలాల సర్పంచుల పోరం ఆధ్యర్యంలో ఘనంగా సన్మానించడంతో పాటు మెదక్ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు సన్మానించారు. అనంతరం బస్సుడిపో వద్ద చంద్ర భవన్ హోటల్ యజమానులు రాగి రమేశ్, వెంకన్న, చంద్రం, చక్రపాణి, వైస్ చైర్మన్ రాగి అశోక్ ఆధ్వర్యంలో గజమాలతో సన్మానించారు. టీఎన్జీవో భవన్‌లో టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంరావు, నరేందర్‌ల ఆధ్వర్యంలో, కోర్టులో బార్ అసోసియేషన్ నాయకులు, న్యాయవాదులు ఘనంగా సన్మానించారు.
చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు..
మెదక్ చర్చిలో గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేసి సుభాష్‌రెడ్డిని ఆశీర్వదించారు. ఈ సందర్భం గా చర్చి విజిటర్ రిజిష్టర్‌లో సంతకం చేశారు. అ నంతరం చర్చి బిషప్ జన్మదినోత్సవాల్లో పాల్గొని బిషప్ సాలోమాన్‌రాజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూభాష్‌రెడ్డని బిషప్ శాలువాతో సత్కరించారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...