యాదవులకు సముచిత స్థానం కల్పిస్తున్న సీఎం కేసీఆర్


Sun,March 17, 2019 10:49 PM

-టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం
-యాదవ సంఘం జిల్లా ప్రతినిధులు
తూప్రాన్ రూరల్ : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని గొర్రె కాపరుల సంఘం జిల్లా డైరెక్టర్ గండి మల్లేశ్‌యాదవ్, యాదవ సంఘం జిల్లా ప్రతినిధి ఆబోతు వెంకటేశ్‌యాదవ్ అన్నారు. ప్రభుత్వ పథకాల్లో సముచిత స్థానం కల్పిస్తున్న టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ సాధించి పెట్టాలని యాదవ కులస్తులకు వారు పిలుపినిచ్చారు. తూప్రాన్‌లో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు.అన్ని వర్గాలు, కులాలతో సమానంగా ఆర్థికంగా ఎదగడం కోసం ప్రాధాన్యతనిస్తూ,చట్టసభల్లోనూ సీఎం కేసీఆర్ యాదవులకు సముచిత స్థానం కల్పించారన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారన్నారు.

గత సమైక్య పాలనలో యాదవ కులస్తులను పూర్తిగా విస్మరించారని, అయితే టీఆర్‌ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ యాదవుల సంక్షేమాభివృద్ధికి తగిన ప్రాధాన్యతను కల్పించారన్నారు. బడుగుల లింగయ్యయాదవ్‌ను రాజ్యసభకు పంపించిన తరహాలోనే ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎగ్గమల్లేశ్‌ను శాసన మండలికి పంపించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.అయితే సీఎం కేసీఆర్ చేసిన మేలును యాదవులు ఎన్నటికీ మరిచిపోరని,పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేసి రుణాన్ని తీర్చుకుంటారన్నారు. ఏప్రిల్ 11న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో యాదవ కులస్తులమంతా టీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లేసి ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించి పెట్టిన మెజార్టీ కంటే ఎంపీ ఎన్నికల్లోనూ రెట్టింపు మెజార్టీ వచ్చేలా యాదవులమంతా కష్టపడుతామన్నారు.ఈ సమావేశంలో యా దవ సంఘం ప్రతినిధులు వెంకటేశ్‌యాదవ్, లంబ మల్లేశ్, చింటూయాదవ్,జంగం నర్సయ్య, నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...