కేంద్రంలో చక్రం తిప్పేది టీఆర్‌ఎస్సే


Sun,March 17, 2019 10:48 PM

దుబ్బాక టౌన్: జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 16 ఎంపీ సీట్లను గెలిచి కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాకకు చెందిన టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు వడ్లకొండ మధు నూతన గృహా ప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ...కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీయే కీలక భూమిక నిర్వహించబోతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తి స్థాయిలో మెజార్టీని సాధించలేని స్థితిలో ఉన్నాయని దీంతో ఏర్పడబోయే సంకీర్ణ ప్రభుత్వంలో టీఆర్‌ఎస్ పార్టీ పాత్ర కీలకం కాబోతుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరును యావత్తు దేశం మెచ్చుకుంటుందని రైతుబంధు లాంటి పథకాలను ఐక్యరాజ్యసమితి సైతం గుర్తించడం సీఎం కేసీఆర్ పాలనకు నిదర్శనమన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాలు కాపీ కొడుతూ ఓట్లు అడుగుతున్న పరిస్థితులున్నాయన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు సైతం టీఆర్‌ఎస్‌లో చేరారని మరికొందరు చేరబోతున్నారని వారు తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనకు దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందన్నారు. తెలంగాణలో 16 ఎంపీ స్థానాలను భారీ మెజార్టీతో గెలుపించుకొని కేంద్రంలో తమ సత్తాను చాటే విధంగా రాష్ట్ర ప్రజలు తీర్పునివ్వాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి, ఆస యాదగిరి, శేర్ల కైలాశ్ తదితరులు ఉన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...