ఇంటి వద్దకే యాప్ ద్వారా సేవలు


Sun,March 17, 2019 10:48 PM

-ఫోన్ ద్వారా కూడా సేవలు పొందవచ్చు
-ల్యాండ్రీ కార్ట్‌ను ప్రారంభించిన అనసూయ భరద్వాజ్
సంగారెడ్డి టౌన్ : ఇంటి వద్దనే యాప్ ద్వారా ల్యాండ్రీ సేవలు ఉపయోగించుకోవచ్చని జబర్దస్త్ ఫేం, సినీతార అనసూయ భరద్వాజ్ అన్నారు. ఆదివారం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో, రాంచంద్రాపురం భీరంగూడలో ల్యాండ్రీ కార్ట్ సేవలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వర్కింగ్ ఉమెన్‌కు ఈ ల్యాండ్రీ కార్ట్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డ్యూటీలకు వెళ్లే మహిళలు తమ ఇంటి వద్ద దుస్తులు ఉతకడం వీలుకాని పక్షంలో ల్యాండ్రీ కార్ట్‌కు యాప్ ద్వారా సమాచారం ఇస్తే అతి తక్కువ ధరలకే దుస్తులు ఉతకడమే కాకుండా వాటిని ఇస్త్రీ చేసి ఇవ్వడం, దుస్తులను డ్రైక్లీనింగ్ చేసి ఇస్తారని వివరించారు. అనంతరం ల్యాండ్రీకార్ట్ పార్టనర్, సినిమా డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబిత సుకుమార్ మాట్లాడుతూ ల్యాండ్రీ కార్ట్ సేవలు పొందేందుకు నూతనంగా యాప్‌ను రూపొందించామన్నారు.

ఈ యాప్ ద్వారా తమ ఏరియా వివరాలు తెలిపితే ఇంటి వద్దకే వచ్చి దుస్తులు తీసుకెళ్లడమే కాకుండా తిరిగి వారి ఇంటి వద్దకే తీసుకెళ్లి ఇస్తారని స్పష్టం చేశారు. యాప్ ద్వారానే కాకుండా టోల్ ఫ్రీ నంబర్ 9533400500 ద్వారా ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా వినియోగదారుల వద్దకే వెళ్లి సేవలు అందిస్తామన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఇప్పటి వరకు చందానగర్, షేక్‌పేట, నల్లకుండ, ఈస్ట్ మారెడ్‌పల్లి, శ్రీనగర్ కాలనీలలో ఐదు ప్రాంచైంజీలను ఏర్పాటు చేశామని, ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, రామచంద్రాపురంలో ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంచైంజీల ద్వారా రెండు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రీమియం ల్యాండ్రీ, డ్రైక్లీనింగ్ సేవలు అందిస్తున్నామన్నారు. 48 గంటల్లోనే డెలివరీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ సేవలు ఎక్కువగా వర్కింగ్ ఉమెన్‌కు ఉపయోగపడుతాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 11 ప్రాంచైంజీలు ఏర్పాటు చేశామని వాటి ద్వారా సేవలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ల్యాండ్రీకార్ట్ పార్టనర్స్ గిరిజా ఖండే, అలేఖ్య, శరత్‌గౌడ్ పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...