అమ్మో..చార్జర్లు


Sun,March 17, 2019 10:48 PM

-నాసిరకం చార్జర్లతో ప్రమాదం
-ఇంట్లో ఎర్తింగ్ తప్పనిసరి
-తడిచేతులతో ముడితే షాట్ సర్క్యూట్
సంగారెడ్డి రూరల్ : ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో తప్పకుండా సెల్‌ఫోన్ ఉంటుంది. యువకుల ఉంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్ వాడుతున్నారు. సెల్‌ఫోన్ హవా వాడ కం మొదలయ్యాక మార్కెట్లో అనేక రకాల కంపెనీలకు రోజుకో కొత్త రకం సెల్‌ఫోన్లను విడుదల చేస్తున్నారు. అదే స్థాయిలో వినియోగదారులు కూడా వాటిని కొనుగోలు చేస్తున్నారు. సెల్‌ఫోన్ వాడకం ఇప్పుడు తప్పనిసరి అయిపోవడంతో ప్రతి ఒక్కరూ ఒకటి, రెండు ఫోన్లు తమ చేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు. ఏ ఫోన్ అయినా చార్జింగ్ లేనిదే అది పని చేయదు. చాలా మం ది తమ ఫోన్లు రాత్రిళ్లు చార్జింగ్ పెట్టి వదిలేస్తారు. ఏ ఫోనుకైనా 2లేదా 3గంటల చార్జీంగ్ పెడితే ఫుల్ అవుతుంది. కానీ కొందరు రాత్రి పడుకునే సమయంలో చార్జింగ్ పెట్టి ఉద యం లేచాక తీస్తారు. దీంతో ఫోన్ పనితీరుపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే చార్జర్ కూడా ఎక్కు వ సేపు ఆన్ చేసి ఉండడంతో చార్జర్ కూడా సరిగా పని చేయదు.

నాసిరకం చార్జర్లతో ప్రమాదం
సాధారణంగా ఎవరైనా ఫోన్ కొన్నప్పుడు చార్జర్ కూడా దాంతో పాటు వస్తుంది. వినియోగదారులు వాటిని వాడకం బట్టి కొద్ది రోజులకే చార్జర్ సరిగా పని చేయకుండా పోతుంది. అది పని చేయటం లేదు కదా అని వేరే చార్జర్ కొంటారు. చార్జర్‌కు ఎక్కువ డబ్బులు ఎందుకు పెట్టాలనుకొని రూ. 100 నుంచి 300లోపు దొరికే సాధారన చార్జర్లను కొంటారు. అవి నాసిరకం కావడమతో చార్జింగ్ పెట్టే సమయంలో కానీ, తీసే సమయంలో కానీ కరెంట్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి ఘటనల్లో కొంతమంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా జనవరి 31న సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన గడ్డమ నీలవెణి ఫోన్ చార్జర్ షాట్‌సర్క్యూట్ చెంది ఆమె మృతి చెందింది.

ఇంట్లో ఎర్తింగ్ తప్పనిసరి
ఇంట్లో ఉండే స్విచ్‌బోర్డులో ఎర్తింగ్ చేసిన వైరు తప్పనిసరిగా ఉండాలని ఎల్రక్ట్రిషియన్లు చెబుతున్నారు. ఎర్తింగ్ సరిగ్గా లేకపోతే కరెంట్‌షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఎవైనా కరెంట్ వస్తువులు ప్లగ్‌లో పెట్టేటప్పుడు కానీ, తీసేటప్పుడు కానీ చేతికి ఎలాంటి తడి ఉండకూడదు. ఎందుకంటే తడి చేతులతో వాటిని పట్టుకోవడం ద్వారా వెంటనే కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా సెల్‌ఫోన్ చార్జర్లు వీలైనంత వరకు నాణ్యమైన కంపెనీవి కొని వాడితే ఎలాంటి ప్రమాదాలు జరుగవని సెల్‌ఫోన్ దుకాణదారులు చెబుతున్నా రు. ఎక్కువగా పిల్లలు తమ ఇంట్లో సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టిమరీ అందులో గేమ్‌లు ఆడుతుంటారు. ఇలా చేయడం అస్సలు మంచికాదు. సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడడం, గేమ్‌లు ఆడడం ద్వారా అవి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లల్ని గమనించి ఇలాంటి చర్యలకు దూరంగా ఉంచాలి.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...