కోనాపూర్ ప్రజల రుణం తీర్చుకోలేనిది


Fri,September 21, 2018 11:26 PM

సదాశివపేట: 2014 ఎన్నికల్లో తన విజయానికి భారీ మెజార్టీ ఇచ్చిన కోనాపూర్ గ్రామప్రజల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కొనియాడారు. శుక్రవారం మండలపరిధిలోని కోనాపూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని వివిధ ఆలయాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మసీదుల్లో ప్రతిష్ఠించిన పీర్లను సందర్శించి ప్రార్థనలు చేసి మొహర్రం పండుగ శభాకాంక్షలు తెలిపారు. తర్వాత సీఎస్‌ఐ చర్చిలో వచ్చే ఈ శాసనసభ ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో కోనాపూర్ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. అప్పట్లో సీఎం కేసీఆర్ ఏ పిలుపు ఇచ్చినా జాతీయ రహదారి ఎక్కి దిగ్భందం చేయడం, ధర్నాలు, రాస్తారోకోలు విజయ వంతం చేసేవారని గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో తనకు భారీ మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపారని మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాక గ్రామంలో దాదాపు రూ.3 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. గ్రామంలో మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ పనులతోపాటు, షాదీముబీరక్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, ఆహార భద్రతతో ప్రతి ఒక్కరికి ఆరుకిలోల బియ్యం వంటి సంక్షేమ పథకాలను అందివ్వడం జరుగుతుందన్నారు.

సంగారెడ్డి నియోజక వర్గంలో రెండు వేల కోట్ల రూపాయల అభివృద్ధిని చేపట్టినట్లు వివరించారు. గత ప్రభుత్వం 10సంవత్సరాలు పాలించినప్పటికీ కోనాపూర్ నుంచి నాగులపల్లి రోడు మోకాలులోతు గుంతలతో నడువలేని దుస్థితిలో ఉండేదని తెలిపారు. తాను ఎమ్మెల్యే అయ్యాక ఆ రోడ్డుకు నిధులు కేటాయించి నిర్మాణం చేపట్టడం జరిగిందని ఇప్పుడు గ్రామ ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల వద్ద తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. నోరు, కడుపు కట్టుకుని పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను మళ్లీ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామంలో పర్యటిస్తున్న క్రమంలో ప్రజలను పలుకరించారు కొందరు వృద్దులు మళ్లీ మీరే ఎమ్మెల్యేగా గెలుస్తారని ఆశీర్వదించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గడీల సుధీర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ ఆంజనేయులు, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ ఖలీద్‌బాబా, నాయకులు సత్యం, సురేశ్, కోనాపూర్ గ్రామ నాయకులు పాల్గొన్నారు.

137
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...