వెనుకబాటు పోవాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి


Fri,September 21, 2018 12:15 AM

నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ: నారాయణఖేడ్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధ్ది సాధించాలంటే మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం నారాయణఖేడ్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కంటే అభివృద్ధిలో వెనుకబడిన నారాయణఖేడ్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల ప్రత్యేక చొరవ కారణంగా ఊహించని రీతిలో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. 60 ఏండ్లుగా అభివృద్ధ్ది కుంటుపడగా కేసీఆర్ ప్రభుత్వం అతి తక్కువ సమయంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గం అన్నిరంగాలో అభివృద్ధి సాధించాలంటే మరో ఐదేండ్లు టీఆర్‌ఎస్‌కు అవకాశమిచ్చి అభివృద్ధ్దికి పునరంకితం కావాలని భూపాల్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

నియోజకవర్గంలో రెండు మార్కెట్‌యార్డులు, 12 సబ్‌స్టేషన్లు, 135 కిలోమీటర్ల మేర డబుల్‌లేన్ రోడ్లు, ఏడు రెసిడెన్షియల్ పాఠశాలలు, 80 శాతం తండాలకు రోడ్డు సౌకర్యం, 54 తండాలను పంచాయతీలుగా ఏర్పాటు, నల్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ, కుల సంఘాలకు కమ్యూనిటీ భవనాలు ఇలా కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక పనులు చేపట్టడం జరిగిందన్నారు. మరో వైపు టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసి రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సన్నబియ్యం వంటి బృహత్తర పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే నంబర్‌వన్ సంక్షేమ రాష్ట్రంగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు. ప్రజల కష్టాలు దూరం కావాలంటే మరోమారు నారాయణఖేడ్‌లో గులాబీ జెండా ఎగరేయాలని కోరారు.

ఊరురా ఊరేగింపులతో స్వాగతం
నారాయణఖేడ్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డి గురువారం నారాయణఖేడ్ మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది. నిజాంపేట, కొత్తపల్లి, ర్యాలమడుగు, ఎంకంపల్లితండా, తెట్టెకుంట తండా, మాణిక్‌నాయక్‌తండా, నర్సాపూర్, సంజీవన్‌రావుపేట, వెంకటాపూర్, కిషన్‌నాయక్‌తండా, మాద్వార్, లింగనాయక్‌పల్లి, హన్మంత్‌రావుపేట, గునుకులకుంట, పోతన్‌పల్లి, నమ్లిమెట్, లింగాపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించగా ప్రజలు బ్యాండ్ మేళాల మధ్య భూపాల్‌రెడ్డిని ఊరేగిస్తూ ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ వెంకట్రామ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మూడ రామ్‌చందర్, జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్,మానిటరింగ్ కమిటీ సభ్యులు రవీందర్‌నాయక్, నాయకులు పార్‌శెట్టి సంగప్ప, సాయిరెడ్డి, లక్ష్మణ్‌రావు, జగదీశ్వర్‌చారి తదితరులు పాల్గొన్నారు.

156
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...