మన ప్రాంతాన్ని మనమే పాలిద్దాం


Fri,September 21, 2018 12:15 AM

వట్‌పల్లి: కొన్ని దశాబ్దాల తర్వాత మన ప్రాంతాన్ని మనం పాలించుకుకే అవకాశం వచ్చిందని ఆశీర్వదించి అండగా ఉంటే ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని అందోల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని గట్‌పల్లి(షాద్‌నగర్)లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. అంతకు ముందు వట్‌పల్లి చౌరస్తాలోని వినాయకుడికి, గట్‌పల్లిలో పీరీలవద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ర్టాలు చేయని విధంగా సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించారని చెప్పారు. ఇక్కడి ప్రజల కోరికను గుర్తించిన సీఎం కేసీఆర్ స్థానిక అభ్యర్థితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తనకు టికెట్ కేటాయించారని స్పష్టం చేశారు. వలసపాలకుల నుంచి విముక్తి కోసం ప్రజలంతా ఏకమై స్థానిక నినాదాన్ని బలపర్చాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులే తమకు మెజార్టీని సాధించి పెడుతాయని కర్యకర్తలందరూ సమష్టిగా కష్టపడి పని చేయాలన్నారు.

ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య అందోల్‌లో జరుగుతున్న పోరును యావత్తు తెలంగాణ రాష్ట్రమంతా చూస్తుందని, అహంకార వాదులైన వలసవాదులకు దిమ్మతిరిగే తీర్పునివ్వాలని ప్రజలను కోరారు. స్థానిక బిడ్డగా ఏ చిన్న కషం వచ్చినా క్రాంతి అంటూ తలుపుతడితే కన్న బిడ్డాలా కష్టాల్లో పాలుపంచుకుంటానని స్పష్టం చేశారు. అనంతరం ఇటీవల మరణించిన పార్టీ సీనియర్ నాయకురాలు కలాలి మాణెమ్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరమార్శించారు. పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని బరోసానిచ్చారు. మొదటి సారి పార్టీనాయకులతో కలిసి గ్రామంలో పర్యటించిన క్రాంతికిరణ్‌ను కలిసేందుకు, యువత ఆసక్తి చూపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి, లింగాగౌడ్, పార్టీ అధ్యక్షుడు వీరారెడ్డి, మండల వైస్ ఎంపీపీ భిక్షపతి, ఏఎంసీ వైస్ చైర్మన్ అశోక్‌గౌడ్, కో- ఆప్షన్ సభ్యుడు కుతూబుద్దీన్, మాజీ ఎంపీపీ విఠల్, ఎంపీటీసీలు శివాజీరావు, నాగరాణీ బస్వరాజ్, నాయకులు వీరారెడ్డి, బుద్ధ్దిరెడ్డి, పుండరీకం,సత్తార్, మధు, శ్రీనివాస్‌గౌడ్, ఎల్లాగౌడ్, సంగమేశ్, అమృత్, బశయ్య,వీరేశం, ఇసామొద్దీన్, రవికుమార్, మాణిక్యంగౌడ్, గోపాల్ పాల్గొన్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...