మన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం


Wed,September 19, 2018 11:46 PM

పెద్దశంకరంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం పెద్దశంకరంపేట మండలంలోని జంబికుంట, కమలాపురం, ఆరెపల్లి, చీలపల్లి, శంకరంపేట, జూకల్, నారాయణపల్లి, వీరోజిపల్లి, రామోజిపల్లి, ఉత్తులూరు, సంగారెడ్డిపేట, కొత్తపేట తదితర గ్రామాల్లో పర్యటించిన అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఖేడ్ ఉప ఎన్నికల్లో మీ ఆశీర్వాదంతో గెలుపొందినప్పటికీ అభివృద్ధి పనులు పూర్తి చేసెందుకు రెండున్నరేండ్లు సరిపోలేదని మరో ఐదేళ్లు అవకాశమిచ్చేలా ఆశీర్వదించాలన్నారు. సీఎం కెసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్లు మళ్లించి సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు నింపి పెద్దశంకరంపేట మండలంలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. దీంతో 365 రోజులు కూడా నీటితో కళకళలాడుతాయన్నారు. ప్రతిఏటా రెండు పంటలు పండించుకోవచ్చన్నారు. లిప్ట్ ఇరిగేషన్‌ద్వారా పేట మండలంలో 15వేల ఎకరాలకు సాగునీరు అందించ వచ్చన్నారు. ఖేడ్ నియోజకవర్గంలో రూ.80 కోట్లతో మిషన్ కాకతీయ పనులు చేపట్టి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టామన్నారు

మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైననీరు
పెద్దశంకరంపేట మండలంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నీళ్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. త్వరలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందజేస్తామన్నారు. తెలంగాణలో రైతులకు నాలుగు విడుతలుగా 17వేల 500 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. వివిధ సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రజాసంక్షేమ రాష్ట్రంగా నిలిచిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలు మెచ్చిన పాలన అందిస్తూ దేశంలోనే నంబర్‌వన్ సీఎంగా గుర్తింపు పొందారన్నారు.

రైతులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
గత ప్రభుత్వాలు రైతులను విస్మరించాయని ఎరువులు, విత్తనాలు, విద్యుత్ సైతం అందించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన కరెంటు అందజేస్తూ ఒక్క రూపాయిలంచం లేకుండా అవసరమైన రైతులందరికీ ట్రాన్స్‌ఫార్మర్లు అందజేశామన్నారు నారాయణఖేడ్‌తో పాటు పెద్దశంకరంపేట మండలంలో మార్కెట్‌యార్డులు, గోదాంలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని పెద్దశంకరంపేట మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సుమారు 15వేల ఎకారలకు సాగునీరు అందజేసి బీడు భూములను సస్యశ్యామలం చేసెందుకు ప్రణాళికలు రూపొందించారన్నారు. దీంతో పాటు నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ద్వారా లిప్ట్ ఇరిగేషన్ ద్వారా ఎక్కువ పంటలు పండించుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చన్నారు. ఖేడ్‌లో ఉప ఎన్నికలు జరిగిన రెండేండ్లలో తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేశామని మరోసారీ ఆశీర్వదించి అత్యదిక మెజార్టీతో గెలిపిస్తే మరో ఐదేండ్లు సేవకుడిలా పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపిపి రాయిని సంగమేశ్వర్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షులు విజయరామరాజు, ఎంపీటీసీలు సుభాశ్‌గౌడ్, మానిక్‌రెడ్డి, మండల రైతు సమన్వయకర్త సురేశ్‌గౌడ్, మాజీ సర్పంచ్‌లు జంగం శ్రీనివాస్, నర్సింహులు, శ్రీను, బీంరావు, నారాగౌడ్, మధు, శంకరయ్య, నాయకులు శంకర్‌గౌడ్, అడివయ్య రులున్నారు.

138
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...