స్థానికతను ఆశీర్వదించండి


Wed,September 19, 2018 11:46 PM

-అందోల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్
-మండలంలో ప్రచారం ప్రారంభం
-అడుగడుగునా కార్యకర్తల నీరాజనాలు
పుల్కల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తోడు అభ్యర్థి స్థానికత అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అందోల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ టీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం పుల్కల్‌లో మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.నాలుగు దశాబ్దాలుగా అందోల్ నియోజకవర్గం స్థానికేతరులు ఏలుబడిలో ఉండి అభివృద్ధిలో వెనుకబడిందని తెలిపారు.గ్రామాల అభివృద్ధే కాకుండా నాయకులు కూడా మండల స్థాయి దాటి ఎదుగలేదని తెలిపారు. చేసిన అభివృద్ధ్ది పనులు కూడా కమీషన్ ఆశించి చేసినవేనని ఆరోపించారు. స్థానిక నాయకులను రాష్ట్రస్థాయిలో ఉండే వివిధ శాఖలు, కార్పొరేషన్‌లలో చైర్మన్లుగా, డైరెక్టర్‌లుగా, ఇలా పలు రకాల పదవులు ఉన్నప్పటికీ స్థానిక నాయకులకు ఇప్పించలేకపోయారని విమర్శించారు. దశాబ్దాలుగా స్థానికేతరనాయకులు మనతో ఊడిగం చేయించుకున్నారని వాపోయారు. సీఎం కేసీఆర్ అందోల్ నియోజకవర్గం గురించి అన్ని తెలిసిన నాయకుడుగా ఈ సారి అసెంబ్లీ అభ్యర్థిగా స్థానికతకు ప్రధాన్యత నిచ్చి టికెట్ కేటాయించాడని తెలిపారు. నియేజకవర్గంలో ప్రతి కార్యకర్త కృషితో భారీ మెజార్టీతో విజయం సాధించి ముఖ్యమంత్రికి అందోల్ సీటును బహుమతిగా ఇద్దామని తెలిపారు.

సింగూర్ కాలువల నిర్మాణంలో కమిషన్‌లు తిన్న మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహా పనులను మాత్రం పూర్తిచేయకుండ కలయాపన చేశారని విమర్శిచాడు.జేఎన్‌టీయూ ఇంజీనీరింగ్ కళాశాల నిర్మాణంలో బందువులతో కాంట్రాక్టింగ్ పనులు చేయించి స్థానికేతరులకు ఉద్యోగాలు అమ్ముకున్నారని విమర్శించాడు..డీసీసీబీ మాజీ వైస్ చెర్మెన్ జైపాల్ రెడ్డి మాట్లాడుతు కాంగ్రేస్ పార్టీని దీటుగా ఎదుర్కోని విజయం సాదించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ప్రతి కార్యకర్త సమన్వయంతో మందుకు సాగాలని పిలుపునిచ్చారు.అసెంబ్లీ ఎన్నికల్లో మన విజయం సాదించి ప్రత్యర్తుల గుండెల్లో రైలు పరుగెత్తించాలని కార్యకర్తలను కోరాడు.

అడుగడుగునా ఘన స్వాగతం.
పుల్కల్ మండలంలో రెండో సారి పర్యటించిన అందోల్ టీఆర్‌ఎస్ అభ్యర్థికి ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు.మందుగా చౌటకూర్ చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. పోసానిపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి గ్రామంలో పర్యటించాడు. అనంతరం బొమ్మారెడ్డిగూడ,మిన్‌పూర్ గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు.మండల కేంద్రం పుల్కల్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు.అనంతరం ఊరేగింపుగా కార్యకర్తల సమావేశానికి చేరుకున్నాడు. కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, జోగిపేట మార్కెట్ కమిటీ అధ్యక్షుడు డీబీ నాగభూషణం, ఎంపీటీసీలు అరుణ, ఈశ్వర్ గౌడ్, సీనియర్ నాయకులు కాశీనాథ్, రమేశప్ప,చౌకంపల్లి శివకుమార్, జడ్పీ మాజీ విప్ నారాయణ, పుల్కల్ మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు గోవర్ధన్,నాయకులు సంగమేశ్వర్‌గౌడ్, కనకారెడ్డి,దర్శన్ రెడ్డి, మహేశ్‌బాబు,శ్రీనివాస్ చారీ, మాణిక్ రెడ్డి, అలీం, శ్రీహరి, శ్రీనివాస్, వీరారెడ్డి,నర్సింహాగౌడ్ పాల్గొన్నారు.

140
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...