కొత్త ఓటరుకార్డుకు దరఖాస్తు చేసుకోవాలి


Wed,September 19, 2018 11:45 PM

వట్‌పల్లి: 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈనెల 25 లోపు కొత్త ఓటరు కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని వట్‌పల్లి తహసీల్దార్ విజయ్‌కుమార్ సూచించారు. బుధవారం మండల కేంద్రం వట్‌పల్లితో పాటు దేవునూర్, గట్‌పల్లి తదితర గ్రామాల్లో కొత్త ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ జనవరి 1-2018 వరకు 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా కొత్త ఓటరు కార్డుకోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు తమ సిబ్బంది అన్ని గ్రామాల్లో కొత్త ఓటరు కార్డులకోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారని స్పష్టం చేశారు. బూత్‌లెవల్ అధికారులు సైతం కొత్త ఓటరు కార్డు నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తూ తగు చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. 25 వరకు అన్ని గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాని కోరారు. దేవునూర్‌లో ఆర్‌ఐ రాజుపాటిల్ డప్పు చాటింపు వేయించి ఓటరు నమోదుకార్యక్రమంపై అవగాహన కలింపంచారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ అశోక్‌గౌడ్, ఎంపీటీసీ శివాజీరావు, వీఆర్వోలు అంజయ్య, సాయిలు, శివరామకృష్ణ, నాయకులు వీరారెడ్డి, సత్తార్, పెంటాగౌడ్, పుండరీకం, గోపాల్, మోహిన్, మోసిన్, కిష్టయ్య అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

రాయికోడ్‌లో..
రాయికోడ్: బీఎల్‌వోలు ఆయా గ్రామాల్లోనే ఉండి ప్రతి రోజు ఇంటింటికీ తిరిగి ఓటరు జాబితలను పరిశీలించాలని తహసీల్దార్ ప్రభులు అన్నారు. బుధవారం రాయికోడ్‌లో స్థానిక తహసీల్దార్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బీఎల్‌వోల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాలో డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారు, పేర్లు తప్పగా ఉండటం తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సమావేశంలో ఉప తహసీల్దార్ కృష్ణయ్య, వివిధ గ్రామాల బీఎల్‌వోలు పాల్గొన్నారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...