తండాల్లో గుబాళిస్తున్న గులాబీ


Wed,September 19, 2018 12:07 AM

-టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మంగళహారతులు
-కారుగుర్తుకే ఓటేస్తామని మాట ఇస్తున్న గిరిజనులు
-ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు

కల్హేర్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తండాలు, గ్రామా లు తేడాలేకుండా ఎక్కడికెళ్లినా సాదర స్వాగతం పలుకుతున్నారు. తండాలను పంచాయ తీలుగా మార్చడంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాము టీఆర్‌ఎస్ కే ఓటేస్తామని ముక్తకంఠంతో చెబుతు న్నారు. గ్రామపంచాయతీలుగా మారి న తండాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మంగళహారతులు పడుతున్నారు. మీవెంటే మేముంటామని నినాదాలు చేస్తున్నారు. మంగళవారం నారాయణఖేడ్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి కల్హేర్, సిర్గాపూర్‌లలో ప్రచారం నిర్వహించారు. పటాన్‌చెరులో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి, చిన్నశంకరం పేటలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు.

గత పాలకులు అందలమెక్కి అవినీతికి పాల్పడ్డారని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నా రు. మండలంలోని బల్కంచెల్క తండావాసులు టీఆర్‌ఎస్ పార్టీకి ముక్తకంఠంతో పూర్తి మద్దతు ప్రకటించారు. మంగళవారం చందర్‌నాయక్, బల్కంచెల్క (భక్తిధామం)తండాలకు ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వెళ్లగా, గిరిజనులు బ్రహ్మరథం పట్టారు. చందర్‌నాయక్ తండా, బల్కంచెల్క తండాల్లో గిరిజన మహిళలు నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. జ్వాలాముఖి జగదాంబ, సేవాలాల్ ఆలయంలో భూపాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాలు, తండాల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

గత పాలకులు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను నట్టేటముంచి మోసం చేశారని ఆయన విమర్శించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందనీయకుండా బినామీ పేర్లతో అవినీతి, అక్రమాలకు పాల్పడి కోట్లకు పడగలెత్తారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో ప్రజా సంక్షేమానికి పెద్దపీ ట వేస్తూ మేనిఫెస్టోలో పొందుపర్చని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రసంశలందుకున్నదన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు నియోజకవర్గంలో 4 ఎస్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. రెం డేండ్ల క్రితం కరువుతో పశువులకు తాగునీరు, మేతకు తీవ్రమైన కొరత ఏర్పడడంతో సీ ఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నల్లవాగు ప్రాజెక్టు పరిహాక ప్రాంతంలో పునరావాసం కేంద్రాన్ని ఏర్పా టు చేశామన్నారు. నియోజకవర్గంలో 54 తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నామన్నారు. రూ.45కోట్లతో బీటీ రోడ్లు నిర్మాణం చేపట్టామని, 40తండాల్లో కమ్యూనిటీ భవనాలను నిర్మించామన్నారు.

బల్కం చెల్క తండాలో నిర్మిస్తున్న 50 డబుల్ బెడ్‌రూంలను పరిశీలించారు. తండాల్లో మౌలిక సదుపాయాలను కల్పించిన ఏకైక సీఎం కేసీఆర్ అని, రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని తండావాసులను కోరారు. గిరిజన మహిళలు మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి తల్వార్‌ను బహూకరించారు. అనంతరం గిరిజన మహిళలతో సహాపంక్తి భోజనం చేశారు. కార్యక్రమం లో ఆర్‌ఎస్‌డీసీవో వెంకట్‌రాంరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ దిలీప్‌కుమార్, ఎస్టీసెల్ మాజీ మండల అధ్యక్షుడు రాంసింగ్, పార్టీ మండలాధ్యక్షుడు కిష్టారెడ్డి, ఉపాధ్యక్షుడు సంగప్ప, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ జిల్లా కమిటీ సభ్యుడు రవీందర్‌నాయక్, పోచాపూర్ ఎంపీటీసీ కృష్ణాగౌడ్, ఆర్‌ఎస్‌ఎంసీవో దుర్గారెడ్డి, వెంకటేశంగుప్తా, అంజిరెడ్డి, సంగారెడ్డి, శంకర్‌నాయక్, లక్ష్మన్‌నాయక్, పాం డ్యనాయక్, అమిర్యానాయక్, విఠల్‌నాయక్, రూప్‌సింగ్, చందర్‌నాయక్, రాములునాయక్, సంగారెడ్డి, కుర్మ సాయిలు, నారాయణరెడ్డి, బాలయ్య, సాయిలు, విఠల్, గిరిజన మహిళలు పాల్గొన్నారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...