కంటి పరీక్షలు 1.18 లక్షలు


Wed,September 19, 2018 12:05 AM

సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ గత 15 నుంచి జిల్లాలో కంటి వెలుగు పరీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం వరకు జిల్లాలో మొత్తం 1,18,297 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 36 బృందాలుగా 432 మంది వైద్య సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. ప్రతి రోజు వైద్యులు ప్రజలకు పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలతో పాటు అవసరమున్నవారికి సర్జరీలు చేయాలని గుర్తించి వారిని హైదరాబాద్‌లోని సరోజినీ కంటి దవఖానకు రెఫర్ చేస్తున్నారు మంగళవారం ఒక్కరోజు 6,219 మందికి పరీక్షలు నిర్వహించి 1,381 మందికి కండ్ల అద్దాలు పంపిణీ చేశారు. 1,299మందికి అద్దాలు అందించేందుకు ఆర్డర్లు చేశారు. 437 మందికి ఆపరేషన్ల కోసం గుర్తించి సిఫార్సులు పంపించారు. కాగా సంగారెడ్డి శాంతినగర్‌లోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంలో ఆప్తోమెట్రిస్టు స్పెషలిస్టు డాక్టర్ సుధాకర్ 116 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 25 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 44 మందికి అద్దాలు అందించేందుకు ఆర్డర్లు చేశారు. 16 మందికి సర్జరీలు చేసేందుకు రెఫర్ చేశారు. అలాగే రెవెన్యూ మహిళా ప్రాంగణంలో నిర్వహించిన కంటి వెలుగులో 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 52 మందికి అద్దాలు పంపిణీ చేశారు. అలాగే 59 మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్లు చేశారు. 6 మందికి ఆపరేషన్‌లు చేసేందుకు రెఫర్ చేశారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...