రాయసముద్రం చెరువును ఆహ్లాదకరంగా మారుస్తాం


Wed,September 19, 2018 12:04 AM

-చెరువు అభివృద్ధికి రూ.7.89 కోట్లు మంజూరు
-మరోసారి గూడెం మహిపాల్‌రెడ్డిని ఆశీర్వదించండి
-మరింత అభివృద్ధి చేసి చూపిస్తాం
-కోనేరు ప్రారంభోత్సవంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
రామచంద్రాపురం: రాయసముద్రం చెరువును సుందరంగా అభివృద్ధి చేసి ఆహ్లాదకరంగా మారుస్తామని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్‌లోని పాతరామచంద్రాపురంలో ని రాయసముద్రం చెరువులో బతుకమ్మ, గణేశ్ నిమజ్జనాల కోసం రూ.80లక్షలతో బల్దియా నిర్మించిన కోనేరు సంపుని కార్పొరేటర్ అంజయ్యయాదవ్‌తో కలిసి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కోనేరులో వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్సీపురంలోని రాయసముద్రం చెరువు అభివృద్ధికి రూ.7.89కోట్లు, పటాన్‌చెరులోని సాకి చెరువు అభివృద్ధికి రూ.10కోట్లు మంజూరయ్యాయన్నారు. వచ్చే 15 రోజుల్లో డీపీఆర్‌లను తయారుచేయించి పనులను ప్రారంభిస్తామని చెప్పారు. రాయసముద్రం, సాకి చెరువులను సుందరంగా, ఆహ్లాదకరంగా అభివృద్ధి చేసి ప్రజలకు చేరువ చేస్తామన్నారు. సాయంత్రం వేళలో పిల్లాపాపలతో ప్రజలు చెరువు వద్దకు వచ్చి సేదతీరే విధంగా చెరువులను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అనంతరం కార్పొరేటర్ అంజయ్యయాదవ్ మాట్లాడుతూ అభివృద్ధిలో ఆర్సీపురం డివిజన్ శరవేగంగా ముందుకుసాగుతుందని తెలిపారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకుపోతున్నట్లు చెప్పారు.

గూడెం మహిపాల్‌రెడ్డిని ఆశీర్వదించండి..
మరోసారి పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలు గూడెం మహిపాల్‌రెడ్డిని ఆశీర్వదించాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కోరారు. నాలుగేండ్లలో పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎప్పుడు జరుగనంత అభివృద్ధి జరిగిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే రూ.4వేల కోట్లు నిధులు తీసుకొచ్చాన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టే నిధులు ఆ మేరకు వచ్చాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, నియోజకవర్గం మరింతగా అభివృద్ధి జరుగాలంటే ప్రజలు గూడెం మహిపాల్‌రెడ్డిని ఆశీర్వదించి పట్టంకట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రాములుగౌడ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుష్పనగేశ్, గ్రంథాలయ డైరెక్టర్ కుమార్‌గౌడ్, వార్డు సభ్యులు మోహన్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, రవీందర్, మాజీ సర్పంచ్ రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు ఆదర్శ్‌రెడ్డి, పరమేశ్‌యాదవ్, నారాయణరెడ్డి, పాపయ్యయాదవ్, సుంకుస్వామి పాల్గొన్నారు.

18 పీటీసీ 03ఎ3,4,5ః వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్ అంజయ్యయాదవ్, పక్కన మాజీ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
18 పీటీసీ 03ఎ6ః మాట్లాడుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...