కానిస్టేబుల్ పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తాం


Wed,September 19, 2018 12:04 AM

మెదక్ అర్బన్: ఈ నెల 30న నిర్వహించే పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) ప్రిలిమినరీ రాత పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని ఉమ్మడి జిల్లా పరీక్షల కో-ఆర్డినేటర్ డాక్టర్ సువర్ణలత పేర్కొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఉమ్మడిజిల్లాలో 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెదక్ జిల్లాలో ఏడు, సిద్దిపేట జిల్లాలో 13, సంగారెడ్డిలో 16 పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21,166 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో మెదక్ జిల్లాలో 4,116, సిద్దిపేటలో 7,050, సంగారెడ్డి 10వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పరీక్ష సమయం 10గంటల నుంచి 1 గంట వరకు ఉంటుందని, ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించబడదన్నారు. గంట ముందు నుంచే పరీక్ష కేంద్రాలకు అనుమతించడం జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రంలో బయోమెట్రిక్ తీసుకోబడుతుందన్నారు. పరీక్ష కేంద్రంలోనికి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్‌లకు, అబ్జర్వర్లు, రూట్ ఆఫీసర్లకు అవగాహన కల్పించారు. సమావేశంలో ఏఎస్పీ నాగరాజు, సిద్దిపేట రూట్ ఆఫీసర్ ప్రభాకర్, అబ్జర్వర్ బాలునాయక్ పాల్గొన్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...