మత్స్యకారులకు ప్రభుత్వం చేయూత


Wed,September 19, 2018 12:03 AM

అందోల్, నమస్తే తెలంగాణ: మత్స్యకారులకు ప్రభుత్వం చేయూతనిస్తుందని, ఈసారి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9 కోట్ల చేపపిల్లలను చెరువుల్లో వదిలేందుకు ప్రభుత్వం మంజూరునిచ్చిందని ఉమ్మడి జిల్లా మత్స్యసహకార సంఘం చైర్మన్ నర్సింహులు తెలిపారు. మంగళవారం అందోల్, అన్నాసాగర్ చెరువులలో చేపపిల్లలను అందోల్-జోగిపేట మున్సిపల్ చైర్మన్ కవిత సురేందర్‌గౌడ్‌తో కలిసి వదిలారు. అందోల్ పెద్దచెరువులో 1.62 లక్షలు, అన్నాసాగర్ చెరువులో 82 వేల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 120 చెరువుల్లో 9 కోట్ల చేపపిల్లలను వదలాల్సి ఉందని, ఇప్పటివరకు 1.50 కోట్ల చేపపిల్లలను మాత్రమే వదలామన్నారు. వర్షాలు అనుకున్న స్థాయిలో కురువకపోవడంతో చెరువుల్లో నీటి శాతం చాలా తక్కువగా ఉందని, చేపపిల్లల్ని వదిలినట్లయితే చనిపోయే అవకాశం ఉందన్నారు.

చేపపిల్లల పెంపకానికి పనికి వచ్చే చెరువులను మాత్రమే ఎంపిక చేసి, వాటిలోనే చేప పిల్లలను వదులుతామన్నారు. సంగారెడ్డి జిల్లాలో 64 లక్షలు, మెదక్‌లో 54 లక్షలు, సిద్దిపేటలో 1.50 లక్షల చేప పిల్లలను వదిలినట్లు ఆయన తెలిపారు. చేపపిల్లలను ప్రభుత్వం ఉచితంగా అందించడం వలన మత్స్యకారులకు ఆర్థికంగా ఎంతగానో ఉపయోగకరంగా ఉందని ఆయన తెలిపారు. ఆయనతోపాటు మున్సిపల్ చైర్‌పర్సన్ కవిత సురేందర్‌గౌడ్, ఎఫ్‌డీవో వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ వెంకటేశం, కౌన్సిలర్లు ప్రదీప్‌గౌడ్, శరత్‌బాబు, నాయకులు రామకృష్ణ, సంఘం సభ్యులు నాగులపల్లి జోగయ్య, యాదయ్య, శ్రీనివాస్, దశరథ్‌లు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...